twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : 'బాహుబలి' ఓవర్ సీస్ రైట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్న శిల్పం... బాహుబలి కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై ట్రేడ్ లో ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్,అనుష్క పుట్టిన రోజులను పరస్కరించుకుని విడుదల చేసిన మేకింగ్ వీడియోలు ఇప్పటికే అందరిలో అమితమైన ఆసక్తిని రేపటంలో సఫలీకృతమయ్యాయి. దాంతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంత వరకూ వెళతాయి అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.

    దాదాపు 10 కోట్ల వరకూ శాటిలైట్ రైట్స్ మొదటి పార్ట్ కి అమ్ముడయ్యే అవకాసం ఉందని అంటున్నారు. అయితే పది కోట్లు పెట్టి కొనే ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు..లేదా ఇద్దరు ముగ్గరు పార్టనర్స్ గా కలిసి దాన్ని కొనుక్కుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది? ఎప్పుడొస్తుంది? అసలు ఇప్పుడేం జరుగుతోంది? ఇంతకీ ఎలా ఉంటుంది ఆ సినిమా? ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడు? ఎంత డబ్బుతో తీస్తున్నారు? ఇలా ఒకటేమిటి? ఒకరేమిటి? ఇతర చిత్ర పరిశ్రమలు కూడా మన 'బాహుబలి' గురించి ఆరాతీస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎంత గోప్యంగా ఉంచుతూంటే అంత ఆసక్తి రేపుతోంది.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా కేరళలో ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజమౌళి కరెక్టుగా ఈగ విడుదలైన రోజు (సంవత్సరం క్రితం)న ఈ చిత్రం ఓపినింగ్ పెట్టుకున్నారు. షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్‌.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగుతుంది.

    Rajamouli's 'Bahubali-1' Overseas Rights?
    మరో ప్రక్క 'బాహుబలి' సినిమా కోసమే అన్నట్టుగా ప్రభాస్‌ కూడా ఓ వార్మప్‌ మ్యాచ్‌ ఆడాడు. అదే... 'మిర్చి'. ఇందులో ఆయన కత్తి పట్టి ప్రతినాయకులతో చెడుగుడు ఆడాడు. సూటూబూటూ ధరించి అమ్మాయిల మనసులతోనూ ఆడుకొన్నాడు. మ్యాచ్‌కి ముందు వార్మప్‌ అని ఒకటుంటుంది. సమరానికి సన్నద్ధమవ్వడంలాంటిదన్నమాట. అందులో ఆటగాళ్ల జోరుని చూసి తదుపరి మ్యాచ్‌ ఫలితంపై ఓ అంచనాకి వస్తుంటాం అలాగే బాహుబలిపై మిర్చి మరింత అంచనాలు పెంచేసింది.

    English summary
    As per the sources from US trade circles, Rajamouli camp is quoting Rs 10 Cr for the overseas rights of ‘Bahubali’ (Part-1). And it is obvious that the price will be separate for ‘Bahubali-2’ that comes in a one month gap.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X