Don't Miss!
- News
ఘనంగా మొదలైన మేడారం మినీ జాతర.. నాలుగురోజుల పాటు సాగే వన సంబరం!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
2.0 మూవీ కలెక్షన్ల హవా.. రెండోవారంలో తగ్గని జోరు.. 600 కోట్లకు చేరువలో..
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను సాధిస్తున్నది. గత ఐదు రోజుల్లో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. కొత్త సినిమాలు రిలీజైన స్టడీగా ఈ సినిమా కలెక్షన్లు సాధిస్తున్నది. ఇక తొమ్మిదో రోజున 2.O మూవీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

తొమ్మిదిరోజుల్లో 2.0 మూవీ
2.0 మూవీ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో రూ.543 కోట్ల వసూలు చేసింది. ఇంకా నిలకడగా కలెక్షన్లు ఉండటంతో 600 కోట్ల మార్కును సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిందీలో భారీగా వసూళ్లు
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2.0 మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కేదారినాథ్ లాంటి సినిమాలు రిలీజ్ అయినా నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. రెండో శని, ఆదివారాలు కలెక్షన్ల పెరిగాయి. శనివారం రూ.150 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. శుక్రవారం రూ.5.85 కోట్లు సాధించడం ద్వారా మొత్తంగా రూ.145.60 కోట్లు వసూలు చేసింది.

తమిళనాడు వ్యాప్తంగా
తమిళనాడు వ్యాప్తంగా 2.0 మూవీ భారీ కలెక్షన్లు సాధించింది. గత తొమ్మిది రోజుల్లో సుమారు రూ.75 కోట్లు సాధించింది. అయితే కబాలి, సర్కార్, బాహుబలి లాంటి చిత్రాల రికార్డులను 2.0 మూవీ అధిగమించలేకపోయింది.

చెన్నైలో వసూళ్లు
చెన్నై బాక్సాఫీస్ వద్ద 2.O మూవీ నిలకడగా వసూళ్లు సాధిస్తున్నాయి. 9వ రోజున 98 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీంతో గత తొమ్మిది రోజుల్లో రూ.15.57 కోట్లు వసూలు చేసినట్టయింది.

చెన్నైలో కబాలిదే రికార్డు
చెన్నై బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ కబాలిదే అత్యున్నత రికార్డు. ఆ తర్వాత బాహుబలి రూ. 18 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత సర్కార్ చిత్రం ఇప్పటి వరకు చెన్నై బాక్సాఫీస్ వద్ద రూ.16 కోట్లు వసూలు చేయడం గమనార్హం.