»   » ‘కబాలి’ షాకింగ్ కలెక్షన్స్: రూ. 700 కోట్లకు చేరువైంది.. (ఫుల్ రిపోర్ట్)

‘కబాలి’ షాకింగ్ కలెక్షన్స్: రూ. 700 కోట్లకు చేరువైంది.. (ఫుల్ రిపోర్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ అంచనాలతో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ 'కబాలి' అంచనాలను అందుకోక పోయినా బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్లు భారీగానే కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం మూడోవారంలోకి ఎంటరైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ భారీ వసూళ్లు చేసిందని, త్వరలో రూ. రూ. 700 కోట్ల మార్కును అందుకుటుందని అంటున్నారు.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న రిపోర్టు ప్రకారం...ఈ సినిమా ఒక్క చైన్నై సిటీలోనే రూ. 11 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈచిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను చెన్నైల్లో భారీగా రిలీజ్ చేయడంలో సక్సెస్ కావడం, రజనీకాంత్ క్రేజ్ కారణంగా సినిమాకు ఒక్క సిటీలోనే ఇంత భారీ మొత్తం వసూలైంది.


ఇక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 75 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇదే అక్కడ పెద్ద రికార్డ్. హిందీ, తెలుగులోకూ భారీగా రిలీజ్ చేయడంతో ఇతర రాష్ట్రాలన్నింటిలో కలిపి ఈ చిత్రం రూ. 220 కోట్ల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు.


చిత్ర నిర్మాత కలైపులి థాను ఓ పత్రికతో మాట్లాడుతూ...'కబాలి రిలీజ్ రోజులు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనివి. ఈ సినిమా రిలీజ్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టింది' అని వెల్లడించారు.


ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసారు. మలేషియా బాషలో కూడా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇతర దేశాలన్నింటిలో కలిపి ఇప్పటి వరకు రూ. 275 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఎక్కువగా యూఎస్ఏ, మలేషియా, జపాన్ దేశాల్లో వసూలైంది.


ఈ సినిమా రిలీజ్ ముందు ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరిగింది. దాదాపు 200 కోట్ల విడుదల ముందే వచ్చాయి. ఈ సినిమా మొత్తం వసూళ్లు దాదాపు రూ. 700 కోట్లకు చేరువయ్యాయని టాక్


మలేషియాలో టోటల్ గ్రాస్

మలేషియాలో టోటల్ గ్రాస్

మలేషియాలో ఈ చిత్రం రూ. 20.3 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ అత్యధికంగా వసూలు చేసిన తమిళ మూవీ ఇదే.


ఫాస్టెస్ట్ 100

ఫాస్టెస్ట్ 100

వేగంగా తొలి రూ. 100 కోట్లు వసూలు చేసిన సౌత్ సినిమాగా ఈ చిత్రం కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందు బాహుబలి పేరుతో ఈ రికార్డ్ ఉండేది.


ఫాస్టెస్ట్ 200

ఫాస్టెస్ట్ 200

వేగంగా రూ. 200 కోట్ల మార్కును అందుకున్న సౌత్ సినిమాగా కూడా ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకు ముందు బాహుబలి పేరుతో ఈ రికార్డ్ ఉండేది.


హయ్యెస్ట్ గ్రాస్ ఓవర్సీస్

హయ్యెస్ట్ గ్రాస్ ఓవర్సీస్

ఫారిన్ కంట్రీల్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సౌత్ సినిమాగా కబాలి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఫారిన్ కంట్రీలన్నింటిలో కలిపి రూ. 275 కోట్లు వసూలు చేసింది.


ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్

ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్

యూఎస్ఏ మార్కెట్లో వేగంగా 1 మిలియన్ డాలర్ మార్కును అందుకున్నసౌతిండియా సినిమాగా కబాలి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.


రజనీకాంత్ రెమ్యూనరేషన్

రజనీకాంత్ రెమ్యూనరేషన్

ఈ సినిమాకు రజనీకాంత్ రూ. 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. శంకర్ 2.0 సినిమాకు ఆయన తీసుకోబోయేది రూ. 45 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.


English summary
Superstar Rajinikanth's latest release Kabali is continuing its dream run at the box office. Well into its third week, the Pa Ranjith directorial is nearing the 700 Crore mark, when it comes to its total worldwide collections, it is said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu