»   »  రామ్ చరణ్ 'మై నేమ్ ఈజ్ రాజు' రిలీజ్ డేట్

రామ్ చరణ్ 'మై నేమ్ ఈజ్ రాజు' రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్‌చరణ్‌ హీరోగాగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. మార్చి 5న చిత్రాన్ని ప్రారంభిస్తారు. 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల చేయాలని దర్సక,నిర్మాతలు నిర్ణయించికున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

Ram charan 'My Name Is Raju' release date

నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. అక్టోబరు 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు. ఈ సినిమాకు 'కొలవెరి...' ఫేమ్‌ అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Star Ram Charan’s new film tentatively titled My Name Is Raju will go on floors from March 16th. Makers have aimed for October 15th release
Please Wait while comments are loading...