»   » పుట్టిన రోజు స్పెషల్:రామ్ చరణ్ హిట్స్, ఫ్లాఫ్స్ లిస్ట్,సక్సస్ రేషియో ఎంత?

పుట్టిన రోజు స్పెషల్:రామ్ చరణ్ హిట్స్, ఫ్లాఫ్స్ లిస్ట్,సక్సస్ రేషియో ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ ఈ రోజు తన 30 వ పుట్టిన రోజులోకి అడుగుపెడుతున్నాడు. మార్చి 27, 1985లో మెగాస్టార్ చిరంజీవి, శ్ర్రీమతి సురేఖ దంపతులకి చెన్నైలో జన్మించాడు.

తన చదువు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత 2007లో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' సినిమాతో తెలుగు పరిశ్రమకి హీరోగా పరిచయమయ్యాడు.


ఆ తర్వాత 2009లో బాహుబలి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన 'మగధీర' సినిమాతో చరణ్ కి సూపర్ స్టార్డం సంపాదించుకున్నాడు. ఆ చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డ్ లు బ్రద్దలు కొట్టి , తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిన రామ్ చరణ్... ఆ మధ్యవరకూ తన సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాడు. రామ్ చరణ్.. 'రచ్చ', , 'ఎవడు'సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచి అతని స్టామినా ఏంటో తెలియచేసాయి.


ప్రస్తుతం సురేంద్రరెడ్డి దర్శకత్వంలో , తమిళ చిత్రం'తని ఒరువన్'(తెలుగులో ధృవ) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే కృత నిశ్చయింతో ఉన్నాడు. మొదటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో చరణ్ కూడా ఒకరని పేరుతెచ్చుకుంటూ, తండ్రికి తగ్గ తనయుడు అనే తెచ్చుకున్న..రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతని కెరీర్ లో హిట్స్, ఫ్లాఫ్స్ ఒకసారి పరీశీలిద్దాం.


చిరుత

చిరుత

పూరిజగన్నాధ్ డైరక్షన్ లో రామ్ చరణ్ ని హీరోగా లాంచ్ చేసిన సినిమా చిరుత. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని ప్రతీ పాట సుపర్ హిట్ అయ్యాయి. చక్రి సంగీతం అందించిన ఈ సినిమా చెర్రికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా 2007 విడుదలైంది.


మగధీర

మగధీర

రాజమౌళి డైరక్షన్ లో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపోందించిన ఈ సినిమా సోషియా ఫాంటసీలో ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. కాల భైరవగా ఈ సినిమాలో అద్బుతమైన ప్రదర్శన కనపరిచాడు చెర్రి. దీనితో తన స్థాయిని సైతం పెంచుకోగలిగాడు. 2009లో ఈ సినిమా విడుదలై, ఆల్ టైం ఇండస్త్ర్రీ హిట్ అయ్యింది.


ఆరెంజ్

ఆరెంజ్

బోమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఓ రేంజ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా, ఆడియో పరంగా సక్సెస్ పరంగా అయినా, ఓవరాల్ గా టోటల్ గా 2010లో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన తన వరకు న్యాయం చేసినట్టు కనిపించినా, కథలో బలం లేకపోవడం వల్లే సినిమా ఆడలేదు. తన సోంత బాబాయ్(నాగబాబు)కి నష్టాన్ని మిగిల్చింది.


రచ్చ

రచ్చ

సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సాధించింది. దీనితో అటు డైరక్టర్ కు, ఇటు రామ్ చరణ్ కు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. 2012 లో విడుదలైంది ఈ సినిమా.


నాయక్

నాయక్

వి.వి.వినాయక్ డైరక్షన్ లో వచ్చిన మాస్ మసాలా చిత్రంనాయక్. మెదటిసారిగా డ్యూయల్ రోల్ నటించిన చరణ్ మంచి మార్కులే కొట్టాడు. తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. ఈ సినిమాలో పాటలన్ని సుపర్ హిట్ అయ్యాయి.2013 ఈ సినిమా విడుదలైంది.తూపాన్, జంజీర్

తూపాన్, జంజీర్

బాలీవుడ్ లో కి ఎంట్రీ ఫిల్మ్ వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆట్టర్ ఫ్లాప్ గా మారిపోయింది. ప్రియాంక చోప్రాలాంటి హీరోయిన్ నటించినా ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. మెదటిసారిగా పోలీస్ గా కనిపించినా, పెద్దగా మెప్పించలేకపోయాడు చెర్రి. 2013 లో ఈ సినిమా విడుదలైంది.ఎవడు

ఎవడు

వంశీ పైడపల్లి డైరక్షన్ లో ఓ హాలీవుడ్ సినిమాను ఇన్సప్రేషన్ గా తీసుకుని చేసిన సినిమా ఎవడు. ఇందులో ఓ గెస్ట్ రోల్ లో అల్లు అర్జున్ మెప్పించాడు. కొత్తదనం కోరుకునే అభిమానులకు ఇది మంచి విందు ఇచ్చినట్టైంది. 2014లో సుపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.


గోవిందుడు అందరివాడేలే

గోవిందుడు అందరివాడేలే

కృష్ణవంళీ డైరక్షన్ లో వచ్చిన పక్కా ఫ్యామిలి ఎంటర్ ట్రైనర్ ఈ సినిమా. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా నిలబడలేదు. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 2014 లోనే ఈ సినిమా విడుదలైంది.బ్రూస్ లీ

బ్రూస్ లీ

శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా ప్లాప్ తో అటు రామ్ చరణ్, ఇటు శ్రీనువైట్ల కెరీర్ కు కొద్దిగా ఇబ్బంది కలిగింది. 2015లో ఈ సినిమా విడదలైంది. కానీ పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.


ప్రస్తుతం

ప్రస్తుతం

రామ్ చరణ్ ప్రస్తుతం సురేంద్రరెడ్డి దర్సకత్వంలో తని ఒరువన్ చిత్రం రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నాడు.ఓవరాల్ గా...

ఓవరాల్ గా...

రామ్ చరణ్ తన కెరీర్ లో సుమారు 75% హిట్స్ తోనూ, మిగిలినవి ప్లాప్స్ తోను విజయపధంలో దూసుకుపోతున్నాడు.వీలైతే

వీలైతే

సంవత్సరానికి ఖచ్చితంగా ఒక్క సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. కుదిరితే రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.ఒక్కటీ లేదు

ఒక్కటీ లేదు

ఒక్క 2008 లోనే సినిమా లేదు. 2013,2014 ల్లో రెండేసి సినిమాలు విడుదలైయ్యాయి.భారీ ఫ్లాప్ లు,బిగ్గెస్ట్ హిట్

భారీ ఫ్లాప్ లు,బిగ్గెస్ట్ హిట్

కెరీర్ లో ఆరెంజ్, బ్రూస్ లీ సినిమాలే అంత్య్ంత బారీ డిజాస్టర్స్ కాగా, మగధీర సినిమా తన కెరీర్ లో ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.


అవార్డ్ లు ,రివార్డ్ లు

అవార్డ్ లు ,రివార్డ్ లు

చెర్రి మెదటి సినిమా చిరుతకు స్పెషల్ జ్యూరీ( నంది ఆవర్డ్), బెస్ట్ మేల్ యాక్టర్ ( ఫిల్మ్ ఫెయిర్ ఆవార్డ్స్) రాగా, మగధీరకు కూడా స్పెషల్ జ్యూరీ( నంది ఆవర్డ్), బెస్ట్ యాక్టర్ ( ఫిల్మ్ ఫెయిర్ ఆవార్డ్స్) వచ్చాయి.గమనిక: ట్రేడ్ లో ..హిట్-ఫ్లాఫ్ నిష్పత్తని అంచనావేసేటప్పుడు, యావరేజ్, ఎబోవ్ యావరేజ్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్స్, హిట్స్, ఇండస్ట్రీ హిట్స్..ఇవన్నీ హిట్స్ గానూ, యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాఫ్, అట్టర్ ప్లాఫ్, డిజాస్టర్ వీటిన్నటినీ ఫ్లాఫ్ లనూ పరిగణించి మాట్లాడుతూంటారు.

English summary
Check here for hits and flops of mega power star Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu