RRR day 8 Colletions: సినీ రాజధానిలో గ్రేటేస్ట్ కలెక్షన్లు.. నైజాంలో వసూళ్ల సునామీ.. ఓవరాల్‌గా ఎంతంటే?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడతున్నది. కరోనావైరస్ లాక్‌డౌన్స్ తర్వాత రికార్డు వసూళ్లు సాధించిన చిత్రంగా విశేషతను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా కలెక్షన్లు నిలకడగా ఉండటంతో రికార్డులు సరికొత్తగా నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ యూఎస్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొత్త రికార్డులతోపాటు 8వ రోజు వసూళ్ల అంచనా ఎలా ఉందంటే..?

ఆస్ట్రేలియాలో కలెక్షన్లు

ఆస్ట్రేలియాలో కలెక్షన్లు


ఇక ఆస్ట్రేలియాలో RRR చిత్రం రికార్డు వసూళ్లను రాబడుతున్నది. వారం దాటినా ఏ మాత్రం కలెక్షన్లలో తగ్గుదల కనిపించడం లేదు. ఈ చిత్రం ఇప్పటికే 2.5 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లను రాబట్టింది. గురువారం ఈ చిత్రం 88 లొకేషన్లలో 106,162 ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. శుక్రవారం కూడా అదే జోష్ కొనసాగించే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 14.44 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

 నైజాంలో బాక్సాఫీస్ రికార్డులతో

నైజాంలో బాక్సాఫీస్ రికార్డులతో


నైజాంలో RRR చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. బాహుబలి1, బాహుబలి2 సృష్టించిన లైఫ్ టైమ్ వసూళ్లను RRR చిత్రం కేవలం వారం రోజుల్లోనే అధిగమించడం విశేషంగా మారింది. బాహుబలి1 చిత్రం 42.5 కోట్లు వసూలు చేస్తే.. బాహుబలి 2 చిత్రం 68 కోట్లు రాబట్టింది. ఇక RRR చిత్రం గత ఆరు రోజుల్లో 77 కోట్లు వసూలు చేసింది. అలాగే నైజాంలోనే ఈ చిత్రం 110 కోట్ల వరకు రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 ఆర్టీసీ క్రాస్ రోడ్డులో హంగామా

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో హంగామా


తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో సినీ రాజధానిగా పేర్కొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డులో RRR చిత్రం రికార్డులను తిరగరాస్తున్నది. తొలి రోజు 75,87,530 రూపాయలు, రెండో రోజు 66,89,448 రూపాయలు, మూడో రోజు 65,81,183 రూపాయలు, నాలుగో రోజు 40,10,686, ఐదో రోజు 32,16,986, ఆరో రోజు 25,03,635, ఏడో రోజు 20,61,054 రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 3.25 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషంగా మారింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రికార్డుల పరంపర

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రికార్డుల పరంపర


ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పలు సినిమాలు సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లు ఇలా ఉన్నాయి. బాహుబలి 2 చిత్రం 3,76,26,472 రూపాయలు, రంగస్థలం 2,41,29,022, బాహుబలి 1 చిత్రం 2,04,75,067, అలవైకుంఠపురంలో 1,97,59,897, పుష్ప చిత్రం 1,89,73,134, సరిలేరు నీకెవ్వరు చిత్రం 1,76,69,289 రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక RRR చిత్రం 7 రోజుల్లో 3,26,50,522 రూపాయలను రాబట్టింది. ఇంకా భారీ వసూళ్లను సాధిస్తూనే ఉంది.

సీడెడ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్

సీడెడ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్


RRR చిత్రానికి సంబంధించిన సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 37 కోట్లుగా నమోదైంది. అయితే వారం రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. తొలి రోజు 17.00 కోట్లు, రెండో రోజు 5.50 కోట్లు, మూడో రోజు 6.40 కోట్లు, నాలుగో రోజు 2.92 కోట్లు, ఐదో రోజు 2.36 కోట్లు, ఆరో రోజు 1.85 కోట్లు, ఏడో రోజు 1.25 కోట్లు వసూలు చేసింది. ఇక 8వ రోజు కూడా 1.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.

 రెండోవారంలోకి దిగ్విజయంగా

రెండోవారంలోకి దిగ్విజయంగా

RRR చిత్రం రెండోవారంలోకి ప్రవేశించింది. అయితే రెండో వారంలో కూడా భారీ సినిమా రిలీజైన సంఖ్యలోనే థియేటర్లలో రన్ అవుతున్నది. తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 1400 థియేటర్లలో రన్ కొనసాగింది. నైజాంలో 329 థియేటర్లలో, సీడెడ్‌లో 220 థియేటర్లలో, ఆంధ్రాలో 450 థియేటర్లలో కలిపి మొత్తం 100 థియేటర్లలో రన్ అవుతున్నది.

Recommended Video

RRR Movie నాలుగో రోజూ రికార్డ్ కలెక్షన్స్.. సోమవారం సెంటిమెంట్ బ్రేక్ | Filmibeat Telugu
8వ రోజు ఎంత వసూలు చేయొచ్చంటే?

8వ రోజు ఎంత వసూలు చేయొచ్చంటే?


ఇదిలా ఉంటే.. RRR చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7 కోట్ల వరకు, హిందీ వెర్షన్‌లో 10 కోట్ల మేరకు, మిగితా రాష్ట్రాల్లో 4 కోట్ల వరకు వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాతో ఈ సినిమా ఇండియాలో మరో 20 కోట్ల వరకు వసూళ్లను సాధించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 393 కోట్ల షేర్, 710 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 8వ రోజున మొత్తంగా కలిపి 750 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X