Don't Miss!
- News
ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
The WARRIORR 5 Days Collections: ఐదో రోజే రామ్‌కు షాక్.. 39 కోట్లకు వచ్చింది ఇంతే.. హిట్ అవ్వాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే, ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. దీనికితోడు ఇటీవలి కాలంలో రామ్ 'ఇస్మార్ట్ శంకర్', 'రెడ్' వంటి హిట్లుతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ జోష్‌తోనే ఇప్పుడు ఈ యంగ్ హీరో 'ది వారియర్' అనే చిత్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

వారియర్‌గా ఎంట్రీ ఇచ్చిన రామ్
ఉస్తాద్ రామ్ పోతినేని - కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన విషయం తెలిసిందే.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ శ్వేత వర్మ: వామ్మో తొలిసారి ఇంత హాట్‌గా!

ది వారియర్ బిజినెస్ వివరాలివే
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ది వారియర్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో మొత్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది.

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5వ రోజు 'ది వారియర్'కు భారీ షాక్ తగిలింది. దీంతో నైజాంలో రూ. 32 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 77 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.
బట్టలు ఉన్నా లేనట్లే టాలీవుడ్ హీరోయిన్ ఫోజులు: అబ్బో ఆమెనిలా చూశారంటే!

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'ది వారియర్' 4 రోజుల్లో నిరాశనే ఎదుర్కొంది. ఈ సినిమా నైజాంలో రూ. 5.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.15 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.18 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.07 కోట్లు, గుంటూరులో రూ. 1.80 కోట్లు, కృష్ణాలో రూ. 85 లక్షలు, నెల్లూరులో రూ. 58 లక్షలతో కలిపి రూ. 15.36 కోట్లు షేర్, రూ. 23.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ. 15.36 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సోసోగానే రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 58 లక్షలు, తమిళంలో రూ. 90 లక్షలు కలెక్ట్ చేసింది. దీంతో 5 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.69 కోట్లు షేర్, రూ. 29.70 కోట్ల గ్రాస్ వచ్చింది.
నగ్నంగా పడుకుని హీరోయిన్ మసాజ్: షాకిస్తోన్న హాట్ సెల్ఫీ వీడియో

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో రూ. 17.69 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 21.31 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.