మొదటిసారి భారీ బడ్జెట్ సినిమా.. రామ్ పోతినేని రెమ్యునరేషన్ ఎంతంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు కూడా మెల్లగా వారి స్థాయిని పెంచుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో కాకపోయినా బైలాంగ్యువల్ అంటూ పెద్ద సినిమాలను టచ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని కూడా కెరీర్ లో మొదటిసారి ఒక భారీ బడ్జెట్ సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. అంతే కాకుండా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటున్నాడు.

ఆ సినిమా కలెక్షన్స్ పై అప్సెట్
రామ్ పోతినేని ఇస్మార్ శంకర్ సినిమాతో కెరీర్ లో మొదటిసారి ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ ఊర మాస్ లుక్కుతో కనిపించింది మార్కెట్ ను పెంచుకున్నాడు. ఇక ఆ తరువాత రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్లుగా కలెక్షన్స్ అందుకోలేకపోయింది.

మొదటిసారి భారీ బడ్జెట్
రెడ్ రిజల్ట్ విషయంలో రామ్ కాస్త అసంతృప్తితోనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ సినిమాతో మాత్రం సాలీడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ 19వ సినిమా భారీగా తెరకెక్కనుంది. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావద్దని అనుకుంటున్నారట. దాదాపు 50కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

రామ్ రెమ్యునరేషన్..
గతంలో ఎప్పుడు లేని విదంగా రామ్ మొదటిసారి భారీ బడ్జెట్ సినిమా చేస్తుండడంతో రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 13 నుంచి 15కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు లింగుస్వామి హిట్టు కొట్టి చాలా కాలం అయినప్పటికీ దాదాపు 6కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్.
Recommended Video

టైటిల్ ఫిక్స్..
ఇక సినిమా టైటిల్ పై కూడా ఇప్పటికే ఒక క్లారిటికి వచ్చినట్లు సమాచారం. రామ్ ఇస్మార్ట్ శంకర్ లో ఉపయోగించిన ట్యాగ్ లైన్ 'ఉస్తాద్' ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక సోమవారం సినిమా షూటింగ్ అయితే మొదలైంది. హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











