twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramarao on duty day 2 collections భారీగా కలెక్షన్లు డ్రాప్.. రెండో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమిటంటే?

    |

    శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వం వహించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం తొలి ఆట నుంచే ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరిచారు.అయితే అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు భారీ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు క్షీణించాయి. ఈ క్రమంలో రెండో రోజు ఈ సినిమా కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

    ప్రతికూల పరిస్థితుల మధ్య

    ప్రతికూల పరిస్థితుల మధ్య


    రామారావు ఆన్ డ్యూటీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. నైజాం , ఆంధ్రాలో కలిపి మొదటి రోజు 2.82 కోట్ల షేర్, 4.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించంది. ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ చిత్రం మెరుగైన వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    రెండో రోజు ఓవరాల్‌గా

    రెండో రోజు ఓవరాల్‌గా


    అయితే తొలి రోజుతో పోల్చుకొంటే.. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం భారీగా క్షీణించింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా 13 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో రెండో రోజు భారీగా వసూళ్లు తగ్గడానికి అవకాశం ఉందనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఆంధ్రా, నైజాంలో ఆక్యుపెన్సీ

    ఆంధ్రా, నైజాంలో ఆక్యుపెన్సీ


    ఆంధ్రాలో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే. విజయవాడలో 9 శాతం, గుంటూరులో 23 శాతం, వైజాగ్‌లో 24 శాతం, కాకినాడలో 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక నైజాంలో మహబూబ్ నగర్ 9 శాతం, కరీంనగర్‌లో 21 శాతం, నిజమాబాద్‌లో 21 శాతం, వరంగల్‌లో 19 శాతం అక్యుపెన్సీ కనిపించింది. బెంగళూరులో 8 శాతం, చెన్నైలో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

    60 శాతం కలెక్షన్లు క్షీణించినట్టు

    60 శాతం కలెక్షన్లు క్షీణించినట్టు


    రామారావు ఆన్ డ్యూటీ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే... ప్రపంచవ్యాప్తంగా 5.95 కోట్ల గ్రాస్, 3.42 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. కడపటి వార్తలు అందే సరికి 60 శాతం క్షీణించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ఈ చిత్రం 2.5 కోట్ల గ్రాస్, 1 కోటికిపైగా షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా 7.5 కోట్ల గ్రాస్ వరకు రెండు రోజుల్లో నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

    18 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యం

    18 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యం


    రామారావు ఆన్ డ్యూటీ బ్రేక్ ఈవెన్ భారీగా ఉంది. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. తాజా అంచనా ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 4.5 కోట్లు రాబడితే.. ఇంకా 13.5 కోట్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

    English summary
    Ravi Teja get positive response at box office on day 2 at Telugu states which releases on july 29th. Here is the movie day collection expected report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X