»   » 'బ్రూస్‌లీ' : రెండు రోజుకే అంత డ్రాపా?

'బ్రూస్‌లీ' : రెండు రోజుకే అంత డ్రాపా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మార్నింగ్ షోకే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్ లు రెండోరోజుకే డ్రాప్ అయ్యాయి. మెదటి రోజు ఆంధ్రా మరియు తెలంగాణ లో 12.66 కోట్లమేర షేర్ రాగా, రెండో రోజు మౌత్ టాక్ స్ర్పెడ్ అవడంతో 4 కోట్ల షేర్ కి పడిపోయింది.


ఇప్పటి వరకు ఆ కలెక్షన్లు ఏరీయా వైజ్ గా...


ఏరియా కలెక్షన్ల్ (షేర్)


ఏరియా కలెక్షన్ల్ (షేర్)
 నైజాం  రూ4.55 కోట్లు
 సీడెడ్  రూ3.27 కోట్లు
 వైజాగ్  రూ1.71 కోట్లు
 గుంటూర్  రూ2.02 కోట్లు
 క్రిష్టా  రూ1.02 కోట్లు
 ఈస్ట్  రూ 1.69 కోట్లు
 వెస్ట్  రూ1.50 కోట్లు
 నెల్లూర్  రూ79 లక్షలు
 మెత్తం  రూ16.55 కోట్లు (కేవలం ఆంధ్రా, తెలంగాణ)
Ramcharan's Bruce Lee 2 days Collections

చిత్రం కథేమిటంటే.....


అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు.


ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

English summary
Bruce Lee which has collected a share of 12.66 in Andhra Pradesh and Telangana on it's day 1, despite the bad word of mouth fell flat on second day. The film collected nearly share of 4 Cరూon day 2 taking two days toll to 16.55 Crs
Please Wait while comments are loading...