»   » తండ్రిని మించిన తనయుడు: 14 రోజుల్లోనే ‘రంగస్థలం’ సెన్సేషన్

తండ్రిని మించిన తనయుడు: 14 రోజుల్లోనే ‘రంగస్థలం’ సెన్సేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rangasthalam Crossed Rs 150 Crore Mark

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీ కేవలం రెండు వారాల్లోనే టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. నిన్నమొన్నటి వరకు ఈ కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉన్న తన తండ్రి మెగాస్టార్ నటించిన 'ఖైదీ నెం. 150' కలెక్షన్లను రామ్ చరణ్ 'రంగస్థలం' 14రోజుల్లోనే అధిగమించింది.

మార్చి 30న విడుదలైన రంగస్థలం తొలి వారంలోనే 128 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో కొన్ని సినిమాలు విడుదలైన అవి 'రంగస్థలం' చిత్రానికి పోటీ ఇచ్చే స్థాయిలో లేక పోవడంతో చరణ్-సుకుమార్ చిత్రానికి ఎదురు లేకుండా పోయింది.

14వ రోజుతో మ్యాజిక్ మార్క్

14వ రోజుతో మ్యాజిక్ మార్క్

సెకండ్ వీకెండ్ కూడా సినిమాకు మంచి ఆదరణ లభించడంతో తొలి 10 రోజుల్లో గ్రాస్ రూ. 147.50 కోట్లకు చేరుకుంది. సాధారణంగా వీక్ డేస్ లో ఏ సినిమాకైనా వసూళ్లు తక్కువగా ఉంటాయి. అయితే ‘రంగస్థలం' విషయంలో ఇది తారుమారైంది. దీంతో రెండో వారంలో కూడా వీక్ డేస్ మంచి వసూళ్లు రాబట్టింది. బాక్సీఫీసు వద్ద 13వ రోజు పూర్తయ్యే నాటికి రూ. 161 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. 14వ రోజుతో మ్యాజిక్ మార్కును అందుకుంది.

 తండ్రి రికార్డును తిరగరాసిన తనయుడు

తండ్రి రికార్డును తిరగరాసిన తనయుడు

ఇప్పటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో ‘ఖైదీ నెం 150' చిత్రం రూ. 164 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో టాప్ పొజిషన్లో ఉంది. ఈ మార్కును 14వ రోజుతో అధిగమించడం ద్వారా తన తండ్రి సినిమా పేరుపై ఉన్న రికార్డును రామ్ చరణ్ తిరగరాశాడు.

రూ. 103 కోట్లకుపైగా షేర్

రూ. 103 కోట్లకుపైగా షేర్

డిస్ట్రిబ్యూటర్ షేర్ విషయంలో కూడా ఈ చిత్రం తొలి స్థానంలో ఉంది. నాన్ బాహుబలి కేటగరీలో రూ. 103 కోట్ల షేర్ వసూలు చేసి ఇప్పటి వరకు ఖైదీ నెం.150 మొదటి స్థానంలో ఉండగా దాన్ని ‘రంగస్థలం' అధిగమించిందని సినీ విశ్లేషకుడు జీవి ట్వీట్ చేశారు.

భారీగా లాభాలు

భారీగా లాభాలు

రంగస్థలం చిత్రం డిస్ట్రిబ్యూటర్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకు రూ. 103 కోట్లకు పైగా షేర్ వసూలు కావడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు మూటగట్టుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా ‘రంగస్థలం' సినిమాతో హాట్రిక్ సక్సెస్ కొట్టారు. వారు ఇంతకు ముందు తీసిన శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ భారీ విజయాలు సాధించగా ఆ రెండు సినిమాలను మించేలా ‘రంగస్థలం' హిట్టయింది.

విజయోత్సవం

విజయోత్సవం

‘రంగస్థలం' సూపర్ హిట్ కావడంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ రోజ సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ విజయోత్సం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు మెగా అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.

English summary
Rangasthalam beat the lifetime record of Khaidi No. 150, which minted Rs 164 crore gross in just 14 days, also earned over Rs 103 crore share for its distributors. Jeevi tweeted, "#Rangasthalam has crossed ₹100 crore share a couple of days back! It will surpass Khaidi No. 150 (₹103 crores) TODAY to become the biggest non-Bahubali blockbuster! (sic)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X