twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూఎస్ఏలో $3.5 మిలియన్ దాటిన ‘రంగస్థలం’

    By Bojja Kumar
    |

    'రంగస్థలం' చిత్రం విడుదలైనప్పటి నుంచి అన్ని ఏరియాల్లో సూపర్ డూపర్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి కేటగిరీలో ఇప్పటికే $3 మిలియన్ డాలర్ మార్కును దాటిన తొలి తెలుగు చిత్రంగా రికార్డుల కెక్కిన ఈ చిత్రం తాజాగా $3.5 మిలియన్ మార్కును అందుకుని మరో రికార్డు నెలకొల్పింది.

    రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ఈ ఇద్దరి కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. మార్చి 30న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి కేటగిరీలో ఈ మార్కును అందుకున్న తొలి టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా రికొత్త రికార్డును నమోదు చేసింది.

    Rangasthalam crosses 3.5 million

    ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణాలు రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా పల్లెటూరి నేపథ్యంతో సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్, చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు, రంగమ్మత్త పాత్రలో అనసూయ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అని చెప్పక తప్పదు.

    మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని హాట్రిక్ కొట్టారు. తొలుత 'శ్రీమంతుడు', ఆ తర్వాత 'జనతా గ్యారేజ్', తాజాగా 'రంగస్థలం' ఇలా ఒకదాన్ని మించి మరో హిట్ కొడుతూ తమ బేనర్ ప్రతిష్టను మరింతగా పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించబోయే తర్వాతి సినిమాను కూడా మైత్రి మూవీస్ వారే నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నారు.

    English summary
    Rangasthalam has been going great guns ever since its released and has surprised the trade pundits with its collections. The latest we hear is that the film has just surpassed the 3.5 million mark in the US and is still playing in some locations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X