»   » రంగస్థలం 6వ రోజు కలెక్షన్స్.. వారం తిరిగేలోపు అక్కడ బాహుబలిని దాటేసింది!

రంగస్థలం 6వ రోజు కలెక్షన్స్.. వారం తిరిగేలోపు అక్కడ బాహుబలిని దాటేసింది!

Subscribe to Filmibeat Telugu
Rangasthalam Beats Bahubali Record In Overseas

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రం బయ్యర్లకు మంచి లాభాలని తెచ్చిపెట్టే దిశగా దూసుకునిపోతోంది. కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూలు చేసిన రంగస్థలం చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని ఏరియాలలో బాహుబలి చిత్రానికి ధీటుగా రంగస్థలం చిత్రం రాణిస్తుండడం విశేషం. 6 వ రోజు కూడా రంగస్థలం చిత్రం బలంగా వసూళ్లని రాబట్టింది. రాంచరణ్ అత్యుత్తమ పెర్ఫామెన్స్, దర్శకుడు సుకుమార్ ప్రతిభ, కథని మలచిన విధానం రంగస్థలం చిత్రం శిఖరాన ఉండడానికి కారణంగా నిలిచాయి. గురువారం కొత్త చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో బుధవారం రంగస్థలం చిత్రానికి కీలకంగా మారింది.

రంగస్థలం చిత్రాన్ని శిఖరాన నిలబెట్టిన అంశాలు

రంగస్థలం చిత్రాన్ని శిఖరాన నిలబెట్టిన అంశాలు

గత వారం రోజులుగా రంగస్థలం చిత్రం సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటి వరకు మాస్ చిత్రాలతో స్టైలిష్ లుక్ లో అలరించిన చరణ్, రంగస్థలం చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటించి అదరగొట్టాడు. చిట్టిబాబు పాత్ర విషయంలో రాంచరణ్ చూపించిన డెడికేషన్, సుకుమార్ దర్శకత్వ శైలి సినిమాని మరో రేంజ్ కు తీసుకుని వెళ్లాయి.

టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా

టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా

రంగస్థలం చిత్రం ఇపప్టికే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతోంది. టాలీవుడ్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన టాప్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాహుబలి తరువాత రెండవ స్థానాన్ని ఆక్రమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

6వ రోజు కూడా అదే జోరు

6వ రోజు కూడా అదే జోరు

కేవలం ఐదు రోజుల్లోనే రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. 6 వ రోజుకూడా అదే జోరు కొనసాగించడంతో రంగస్థలం చిత్ర షేర్ 76 కోట్లవరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 6 రోజుల్లో 54.22 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.

అక్కడ బాహుబలి రికార్డు చెరిగిపోయింది

అక్కడ బాహుబలి రికార్డు చెరిగిపోయింది

కేవలం ఉత్తరాంధ్రలో ఇప్పటివరకు ఈ చిత్రం 7.37 కోట్లు షేర్ వసూలు చేసింది. దీనితో బాహుబలి 1 కలెక్షన్లని ఈ చిత్రం విజయవంతంగా అధికమించినట్లు అయింది.

 గురువారం నుంచి పోటీ

గురువారం నుంచి పోటీ

రంగస్థలం చిత్రానికి గురువారం నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తెరెకెక్కిన నితిన్ చిత్రం ఛల్ మోహన్ రంగ నుంచి రంగస్థలం చిత్రానికి ఎంతో కొంత పోటీ ఎదురైయ్యే అవకాశం కనిపిస్తోంది.

English summary
Rangasthalam Movie surpasses Bahubali in Uttar Andhra area. 6 th day collections also strong.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X