»   » రంగస్థలం: యూఎస్ఏ బాక్సాఫీసు రిపోర్టుతో అంతా షాక్!

రంగస్థలం: యూఎస్ఏ బాక్సాఫీసు రిపోర్టుతో అంతా షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం యూఎస్ఏ బాక్సాపీసు వద్ద 2 రోజుల్లోనే 1.50 మిలియన్ డాలర్క్ మార్కను దాటేసి చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఆల్రెడీ ధృవ రికార్డును బీట్ చేసింది.

నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని 200 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షోల ద్వారా $706,612 వసూలు చేసింది. సుకుమార్, చరణ్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ ప్రీమియర్ షో గ్రాసర్. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజైన శుక్రవారం 168 లొకేషన్లలో ప్రదర్శితం అయి $588,165 వసూలు చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి శుక్రవారం నాటికి టోటల్ గ్రాస్ $1,294,777 రీచ్ అయింది.

Rangasthalam US box office collection

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రానికి శనివారం కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంకా అఫీషియల్ రిపోర్ట్ బయటకు రాలేదు. ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం రెండో రోజు $645,114 వసూలైనట్లు తెలుస్తోంది. దీంతో శనివారం నాటికి టోటల్ కలెక్షన్ $1,939,890 రీచ్ అయింది. ఫైనల్ ఫిగర్ బయటకు వచ్చే సమయానికి 2 మిలియన్ మార్క్ దాటడం ఖాయం అంటున్నారు.

రామ్ చరణ్ గత చిత్రం ధృవ రికార్డ్ $1.47 మిలియన్ మార్కును 'రంగస్థలం' 2వ రోజే బీట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలో యూఎస్ఏలో 2 మిలియన్ మార్క్ అందుకున్న 9వ చిత్రంగా 'రంగస్థలం' నిలిచింది.

తొలి వీకెండ్ రిపోర్ట్ వచ్చే నాటికి రంగస్థలం చిత్రం ఇప్పటి వరకు ఉన్న నాన్నకు ప్రేమతో(2.02 మిలియన్), ఫిదా (2.06 మిలియన్), అజ్ఞాతవాసి (2.06 మిలియన్), ఖైదీ నెం 150 (2.44 మిలియన్) రికార్డులను బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
The Ram Charan starrer Rangasthalam has fared well on Saturday too and the makers are yet to reveal its figures. As early reports, Rangasthalam has collected $645,114 at the US box office on its second day, taking its total collection to $1,939,890 in the country. This movie will easily cross the $2 million dollar mark when the final figures are released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X