twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    83 movie 5 days collections: అతికష్టంతో 100 కోట్లు.. భారీ నష్టాల దిశగా కపిల్ బయోపిక్

    |

    క్రికెట్ క్రీడా రంగంలో భారత్‌ ప్రపంచకప్‌ సాధించిన 1983 సంవత్సరం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అండర్‌ డాగ్ ట్యాగ్‌తో బరిలో దిగిన భారత్ వెస్టిండీస్ జట్టును కపిల్ డెవిల్స్ ధీటుగా ఎదుర్కొని కప్‌ను సాధించారు. ప్రపంచకప్ సాధించిన జట్టుకు నేతృత్వం వహించిన కపిల్ దేవ్ జీవితంలోని కొన్ని కీలక సంఘటనలు తీసుకొని రూపొందించిన చిత్రం 83. ఈ సినిమాకు సినీ విమర్శకుల నుంచి దేశవ్యాప్తంగా భారీగా స్పందన లభించింది. అయితే బాక్సాఫీస్ వద్ద కురిసిన వసూళ్లు మాత్రం నిరాశను కలిగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో 83 మూవీ చిత్రానికి సంబంధించిన 5 రోజులు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే.

    270 కోట్ల బడ్జెట్‌తో

    270 కోట్ల బడ్జెట్‌తో


    83 మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందింది. ఈ సినిమాను 270 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా దానిని ఈ చిత్రం పాజిటివ్‌గా మలుచుకోలేకపోయింది. అతికష్టం మీద 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ముందు కూడా భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశం కనిపించడం లేదనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

     పుష్ప, స్పైడర్ మ్యాన్ దెబ్బ

    పుష్ప, స్పైడర్ మ్యాన్ దెబ్బ

    ఉత్తరాదిలో నెలకొన్న కరోనావైరస్ పరిస్థితులు 83 చిత్రానికి శాపంగా మారాయి. 50 శాతం అక్యుపెన్సీ అందుకు కారణం అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అంతేకాకుండ స్పైడర్ మ్యాన్: నే వే హోమ్, పుష్ప చిత్రాల నుంచి భారీ పోటీ ఎదురైంది. దాంతో భారీగా కలెక్షన్లు సాధించలేకపోయాయనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

    దేశవ్యాప్తంగా 5 రోజుల కలెక్షన్లు

    దేశవ్యాప్తంగా 5 రోజుల కలెక్షన్లు

    83 చిత్రానికి సంబంధించిన ఐదు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం రోజున 12.64 కోట్లు, శనివారం రోజున 16.95 కోట్లు, ఆదివారం రోజున 17.41 కోట్లు, సోమవారం 7.29 కోట్లు వసూలు చేసింది. ఇక మంగళవారం 6.70 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 60.99 కోట్ల షేర్‌ను సాధించింది. అలాగే ఓవర్సీస్‌లో సుమారు 26 కోట్టు రాబట్టినట్టు సమాచారం.

    ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల వసూళ్లు

    ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయానికి వస్తే.. తొలి రోజున 83 చిత్రం 25.16 కోట్లు, రెండో రోజున 29.41 కోట్లు, మూడో రోజున 29.34 కోట్లు, నాలుగు రోజున 11.29 కోట్లు, ఐదో రోజున 10 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో 83 చిత్రం 104 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ వసూళ్లు మాత్రం నిర్మాతలకు నిరాశనే మిగిల్చాయి.

    జెర్సీ వాయిదాతో పోటీ లేకుండా

    జెర్సీ వాయిదాతో పోటీ లేకుండా

    రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్ నటించిన 83 చిత్రానికి సంబంధించిన వసూళ్లు క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి. అయితే జెర్సీ సినిమా రిలీజ్ వాయిదా పడటం కొంత ఉపశమనం. మరో వారం పాటు 83 సినిమాకు ఎదురు ఉండదు. మరో వారం రోజుల్లో మరికొంత వసూళ్లు రాబట్టే అవకాశం కలిగింది అని తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    83 Movie Review is based on India's journey at the 1983 Cricket World Cup. Ranveer Singh, Deepika Padukone and Deepika Padukone are in lead role. Directed by Kabir Khan. This movie hits the screen on December 24th, 2021. This movie joined in 100 crore club on day 5.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X