twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita ramam day 2 collections బాక్సాఫీస్‌ను కుమ్మేసిన సీతారామం.. రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

    |

    ప్రేమ, యుద్ధం నేపథ్యంగా రూపొందిన ఫీల్ గుడ్, ఎపిక్ లవ్ స్టోరి సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రానికి సగటు ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ విమర్శకుల నుంచి కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. శుక్రవారం రోజు అంచనాలకు మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే తొలి రోజు కంటే రెండో రోజు 50 శాతానికి పైగా వసూళ్లను సాధించింది అనే రిపోర్ట్‌ను ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

    యూఎస్‌లో ఎక్సలెంట్‌గా రెండో రోజు

    యూఎస్‌లో ఎక్సలెంట్‌గా రెండో రోజు


    అమెరికాలో సీతారామం సినిమాకు భారీ స్పందన రెండో రోజు కనిపించింది. ప్రధాన నగరాల్లో ఎక్సలెంట్ బుకింగ్స్‌తోపాటు అక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. ఈ సినిమాను 203 లొకేషన్లలో ప్రదర్శించగా 72 వేల డాలర్లను వసూలు చేసింది. తొలి రోజుతో పోల్చుకొంటే రెండో రోజు భారీగా వసూళ్లు నమోదయ్యాయి. రెండో రోజున 72k డాలర్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. రెండో రోజు ముగిసే సమయానికి 300k డాలర్లను దాటే అవకాశం కనిపిస్తున్నది.

    హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అక్యుపెన్సీ

    హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అక్యుపెన్సీ


    సీతారామం సినిమాకు హైదరాబాద్‌లో భారీ అడ్వాన్స్ బుకింగ్‌తోపాటు కరెంట్ బుకింగ్‌కు ప్రేక్షకుల పోటెత్తారు. హైదరాబాద్‌లో మొత్తం 316 షోలు ప్రదర్శించగా.. అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 30 శాతం టికెట్లు బుక్ అయ్యాయి. దాంతో 54 లక్షల రూపాయల కలెక్షన్లను ఆన్‌లైన్ టికెటింగ్ ద్వారానే నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    తెలుగు వెర్షన్‌ అక్యుపెన్సీ

    తెలుగు వెర్షన్‌ అక్యుపెన్సీ


    సీతారామం సినిమాకు మౌత్ పబ్లిసిటీ పెరగడంతో రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బుకింగ్ నమోదైంది. తెలుగు వెర్షన్‌కు హైదరాబాద్‌లో సగటున 50 శాతానికి పైగా, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, కాకినాడ, నిజమాబాద్‌లో సుమారు 40 శాతానికిపైగా అక్యుపెన్సీ కనిపించింది. బెంగళూరులో 30 శాతం, చెన్నైలో 74 శాతం, ముంబైలో 30 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

    తమిళ వెర్షన్ అక్యుపెన్సీ

    తమిళ వెర్షన్ అక్యుపెన్సీ


    తమిళ వెర్షన్ సీతారామం చిత్రానికి తమిళనాడులో మంచి రెస్సాన్స్ కనిపించింది. ఆన్‌లైన్ బుకింగ్ విషయానికి వస్తే.. చెన్నైలో 40 శాతం, మధురై, పాండిచ్చేరి, కోచి, త్రివేండ్రం, హైదరాబాద్‌లో సుమారు 30 శాతం అక్యుపెన్సీ నమోదైంది. పలు ప్రాంతాల్లో కరెంట్ బుకింగ్ మంచి డిమాండ్ కనిపించింది.

    మలయాళ వెర్షన్ అక్యుపెన్సీ

    మలయాళ వెర్షన్ అక్యుపెన్సీ


    ఇక మలయాళం వెర్షన్ విషయానికి వస్తే.. బెంగళూరులో 45 శాతం అక్యుపెన్సీ, కోజికోడ్‌లో 40 శాతానికిపైగా, మిగితా ప్రాంతాల్లో సుమారు 25 శాతం అక్యుపెన్సీ లభించింది. సెకండ్ షోకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేకపోయాయి.

    రెండో రోజు సీతారామం కలెక్షన్ల అంచనా

    రెండో రోజు సీతారామం కలెక్షన్ల అంచనా


    సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 5.6 కోట్ల గ్రాస్, 3.05 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో 2.4 కోట్లు, తమిళంలో 35 లక్షలు, మలయాళంలో 3 లక్షలు వసూలు చేసింది. అయితే తాజా వార్తల ప్రకారం రెండో రోజు దేశవ్యాప్తంగా 4.5 కోట్ల షేర్, 7 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక అమెరికాలో 60 లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    వారాంతంలోగా బ్రేక్ ఈవెన్?

    వారాంతంలోగా బ్రేక్ ఈవెన్?


    తాజా ట్రేడ్ వివరాలను బట్టి సీతారామం సినిమా రెండో రోజున 5 కోట్లకుపైగా షేర్ సాధించే అవకాశం ఉంది. అంటే ఈ సినిమా వారాంతం నాటికి బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 17 కోట్లు.. అంటే శనివారం వరకు 9 కోట్లు సాధిస్తే.. లాభాలకు చేరువైనట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Malayalam actor Dulquer Salmaan, Bollywood actor Mrunal Thakur starrer Sita Ramam has Rashmika Mandanna in an important role. The prestigious film 'Sita Ramam' is produced by star producer Aswini Dutt under the banner of Swapna Cinema and is presented by Vyjayanthi Movies. Here are the day 2 Expected collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X