Don't Miss!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- News
వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ - సీఎం జగన్ మార్క్ నిర్ణయం..!!
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ramarao On Duty 3 Days Collections: రవితేజకు కోలుకోలేని షాక్.. సండే కూడా అంతేనా.. ఇంకెంత రావాలంటే!
మాస్ మహారాజా రవితేజ.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ మాస్ హీరో దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో టాలీవుడ్‌లో సందడి చేస్తున్నాడు. అంతేకాదు, ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.
ఇక, ఈ ఏడాది ఆరంభంలో 'ఖిలాడి' అనే సినిమా చేసిన రవితేజ.. గత శుక్రవారమే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

రామారావుగా వచ్చేసిన రవితేజ
టాలీవుడ్ స్టార్ రవితేజ - శరత్ మందవ కలయికలో రూపొందిన సినిమానే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేశాడు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించాడు.
టాప్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ లహరి: తొలిసారి ఓ రేంజ్‌లో అందాల ఆరబోత

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్
రవితేజ మార్కెట్ అనుగుణంగానే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'రామారావు
ఆన్
డ్యూటీ'కి
తెలుగు
రాష్ట్రాల్లో
3
రోజు
కలెక్షన్లు
తగ్గాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
18
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
5
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
4
లక్షలు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
2
లక్షలు,
వెస్ట్
గోదావరిలో
రూ.
1
లక్షలు,
గుంటూరులో
రూ.
3
లక్షలు,
కృష్ణాలో
రూ.
3
లక్షలు,
నెల్లూరులో
రూ.
1
లక్షలతో..
ఏపీ,
తెలంగాణలో
రూ.
37
లక్షలు
షేర్,
రూ.
60
లక్షలు
గ్రాస్
మాత్రమే
వసూలైంది.
Bigg Boss Winner: బిందు మాధవి అందాల ఆరబోత.. తొలిసారి అలాంటి డ్రెస్‌లో కనిపించడంతో!

3 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది
ఏపీ, టీఎస్‌లో 'రామారావు ఆన్ డ్యూటీ'కి మూడు రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలుపుకుని రూ. 3.65 కోట్లు షేర్, రూ. 6.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో కేవలం రూ. 3.65 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 43 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 3 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.38 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.60 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.38 కోట్లు వచ్చాయి. అంటే మరో 13.62 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది.

ఆదివారం కూడా ఇంత తక్కువా?
రవితేజ హీరోగా శరత్ మందవ తెరకెక్కించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రానికి ఆదరణ తగ్గిపోతూనే వస్తోంది. అయితే, ఆదివారం సెలవు రోజు కావడంతో దీనికి వసూళ్లు పెరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఆశ్చర్యపరుస్తూ సండే కూడా తగ్గాయి. ఇది నిజంగా రవితేజకు భారీ షాకే అని చెప్పుకోవచ్చు.