twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Kantara Collections: 2 కోట్లకు కొంటే.. 4 వారాల్లో సంచలనంగా.. లాభం ఎన్ని కోట్లో తెలిస్తే మెంటలే!

మారుతోన్న ప్రేక్షకుల అభిరుచి ప్రకారమే అన్ని ఇండస్ట్రీల నుంచి అదిరిపోయే కొత్త కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. అలా రిలీజ్ అయిన మూవీలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తుండడంతో మిగిలిన వాళ్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇటీవలే కన్నడంలో రూపొంది సంచలన విజయం సాధించిన చిత్రమే 'కాంతార'. తెలుగులో దీనికి ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ నాలుగు వారాల్లో తెలుగులో ఎంత వసూలు చేసింది? ఓవరాల్‌గా ఎంత రాబట్టింది? చూద్దాం పదండి!

కన్నడం నుంచి తెలుగులోకి

కన్నడం నుంచి తెలుగులోకి

కన్నడ పరిశ్రమకు చెందిన ఆల్‌రౌండర్ రిషబ్ శెట్టి తీసిన క్రేజీ సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని తెలుగులో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్
పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు

కన్నడ పరిశ్రమలో క్రేజీ కాన్సెప్టుతో రూపొంది.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఆంధ్రా, తెలంగాణలోనూ అత్యధిక లోకేషన్లలో విడుదలైంది.

28వ రోజు తెలుగు వసూళ్లిలా

28వ రోజు తెలుగు వసూళ్లిలా

'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 28వ రోజు వసూళ్లు కాస్త పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 16 లక్షలు షేర్, రూ. 30 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

డోసు పెంచేసిన జబర్దస్త్ వర్ష: ముందూ వెనుక ఏమీ లేకుండా హాట్ షో
డోసు పెంచేసిన జబర్దస్త్ వర్ష: ముందూ వెనుక ఏమీ లేకుండా హాట్ షో

4 వారాల్లో ఎంత వచ్చింది?

4 వారాల్లో ఎంత వచ్చింది?

28 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.54 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, గుంటూరులో రూ. 1.68 కోట్లు, కృష్ణాలో రూ. 1.64 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26.71 కోట్లు షేర్, రూ. 50.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

విలక్షణమైన కథతో రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 4 వారాల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 26.71 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.41 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

అషు రెడ్డి 'కామం' వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!
అషు రెడ్డి 'కామం' వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

'కాంతార' చిత్రం కన్నడంలో 43 రోజుల క్రితమే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇది 43 రోజుల్లో కర్నాటకలో రూ. 173.85 కోట్లు, తెలుగులో రూ. 50.30 కోట్లు, తమిళంలో రూ. 9.60 కోట్లు, కేరళలో 13.30 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 88.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.50 కోట్లతో మొత్తంగా రూ. 363.45 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 184.05 కోట్లు షేర్‌ రాబట్టింది.

English summary
Rishab Shetty Did Kantara Movie Under Own Direction. This Movie Collects 26.71 Crore Share in 4 Weeks in Telugu States.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X