»   » ఫ్లాఫ్ టాక్ సినిమాకు కొత్త పోపు:దిల్ రాజు స్కెచ్ ఫలిస్తుందా?

ఫ్లాఫ్ టాక్ సినిమాకు కొత్త పోపు:దిల్ రాజు స్కెచ్ ఫలిస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా హిట్ సినిమాలకు కొద్ది రోజులు అయ్యాక,కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి అనుకున్న సమయంలో క్రేజ్ తేవటం కోసం కొత్త సీన్స్ కలుపుతూంటారు. అలాగే సినిమా తేడా వస్తే ఆ రోజే సీన్స్ ట్రిమ్ చేస్తున్నారు కూడా. అయితే సినిమాకు ఫ్లాఫ్ టాక్ వచ్చాక, సీన్స్ కలిపితే ఏమన్నా ఫలితం ఉంటుందా...ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్ట్రాటజీ ఏంటో చూడాలి మరి.

దర్శకుడు మారుతి, తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శ్రేయాస్ శ్రీనివాస్‌లతో కలిసి 'రోజులు మారాయి' అనే కామెడీ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కొందరు ఫ్లాఫ్ అంటే మరికొంతమంది... టైమ్ పాస్ వ్యవహారం అని తేల్చేసారు. ఫస్టాఫ్ సినిమా బాగున్నా..సెకండాఫ్ లో విషయం లేకపోవటం ఇబ్బంది పెట్టింది.


ఈ నేపథ్యంలోనే 'రోజులు మారాయి' టీమ్, ఎడిటింగ్ దశలో సినిమా నుంచి తీసేసిన కొన్ని సన్నివేశాలను ఈ శుక్రవారం నుంచి జత చేయాలని దిల్ రాజు నిర్ణయించినట్లు సమాచారం. 8 నిమిషాల నిడివి గల ఈ సన్నివేశాల్లో జబర్దస్త్ ఫేం అప్పారావు నేపథ్యంలో వచ్చే కామెడీ అందరినీ అలరిస్తుందని టీమ్ తెలిపింది.


Also Read: కామెడీ విత్ మెసేజ్.. ('రోజులు మారాయి' రివ్యూ)


Rojulu Marayi:New scenes to be added

సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా నిర్మాతలు కొత్త సన్నివేశాలను జత చేస్తున్నట్లు తెలిపారు. చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళి దర్శకత్వం వహించారు.


చిత్రం కథేమిటంటే.. అశ్వంత్ (చేతన్) ఆధ్యా (కృత్తిక జయకుమార్) తో ప్రేమలో ఉంటాడు. అలాగే పీటర్ (పార్వతీశం) ..రంభ (తేజస్విని) తో ప్రేమలో పడతారు. ఆధ్యా, రంభ ఇద్దరూ రూమ్ మేట్స్. ఇద్దరూ ఇండిపెండింట్. అయితే ఆధ్య, రంభలు ఇద్దరూ మంచి డబ్బున్నవాళ్లని, తాము కలలు కనే రాజకుమారులను పెళ్లిచేసుకోవాలని యుఎస్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు. ఈ లోగా ఓ స్వామిజి ద్వారా వారికో విషయం తెలుస్తుంది.


తమను ఎవరితై పెళ్లిచేసుకుంటారో వాళ్లు నెల తిరక్కుండా మరణిస్తారని. ఈ సమస్య నుంచి తప్పించుకోవటం కోసం వారు ఓ ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ లో భాగంగా పీటర్, అశ్వంత్ లను వాడుకోవాలని చూస్తారు. ప్లాన్ ని అమలుపరుస్తూ..పీటర్, అశ్వంత్ లను పెళ్లి చేసుకుంటారు. అయితే కొద్ది రోజులు తర్వాత వారిద్దరూ చనిపోతారు. అసలు వాళ్ళకేం జరిగింది. అసలు ట్విస్ట్ ఏంటి అనేది మిగతా కథ.


మారుది, దిల్ రాజు కాంబినేషన్ లో కలిసి నిర్మించిన చిత్రం 'రోజులు మారాయి' . మారుతి కథ,స్క్రీన్ ప్లే అందించటంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. అలాగే దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత ఇలాంటి చిన్న సినిమాను నిర్మిస్తున్నారనగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది.


ఇలాంటి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫస్టాఫ్ బాగానే ఎంజాయ్ చేసేలా రూపొందింది. సెకండాఫ్ మాత్రం పూర్తి ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. అవుడ్ డేటెడ్ అనిపించింది . అయితే కామిడి కొంత వర్కవుట్ అవటం కొంతలో కొంత ప్లస్ అయ్యింది.

English summary
Rojulu Marayi team is adding new scenes to their film. The freshly added scenes will be screened starting this Friday and as per am official update from the makers, 8 minutes in the second half have been added additionally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu