twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Romantic 1st Day Collections.. పనిచేయని పూరీ జగన్నాథ్ మ్యాజిక్‌.. అంచనాలకు భిన్నంగా కలెక్షన్లు

    |

    స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి, యువ హీరోయిన్ కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం రొమాంటిక్. పూరీ జగన్నాథ్ కథ, మాటలను అందించగా అనిల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందు భారీగానే సందడి చేసింది. అక్టోబర్ 29వ తేదీన ఈ చిత్రం తొలి ఆట తర్వాత ప్రేక్షకుల మనసులను పూర్తిగా గెలుచుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో రొమాంటిక్ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..

    కేతిక శర్మ గ్లామర్ ట్రీట్‌తో

    కేతిక శర్మ గ్లామర్ ట్రీట్‌తో

    రొమాంటిక్ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులపై పెద్దగా క్యూరియాసిటిని పెంచలేకపోయాయి. ఈ క్రమంలో సినిమా బజ్ క్రియేట్ చేయడానికి సెలబ్రిటీలకు ప్రీమియర్ వేశారు. రాజమౌళితోపాటు పలువురు టాలీవుడ్ అగ్ర దర్శకులు ఈ సినిమాపై సానుకూలంగా స్పందించారు. కేతిక శర్మ అందాల ఆరబోతపై ఫిదా అయ్యారు. క్లైమాక్స్ మాత్రం బాగుందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాంతో మరికొంత క్రేజ్ పెంచే ప్రయత్నం జరిగింది.

    రొటీన్ కథ, కథనాలతో

    రొటీన్ కథ, కథనాలతో

    రొమాంటిక్ రిలీజ్ అనంతరం తొలి ఆట తర్వాత రొటీన్ కథ, కథనాలతో చేసిన ప్రయోగం వెండితెర మీద బెడిసి కొట్టిందనే వాదన వినిపించింది. కేతిక శర్మ అందాల ఆరబోత, ఆకాశ్ పూరి ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా కాస్త నిలదొక్కుకొనే ప్రయత్నం చేసిందనే సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్ వ్యక్తమవ్వడంతో రొమాంటిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.

    తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు

    రొమాంటిక్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఓ మాదిరి కలెక్షన్లు వసూలు చేసింది. నైజాంలో 55 లక్షలు, సీడెడ్‌లో 27 లక్షలు, ఉత్తరాంధ్రతో 19 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 12 లక్షలు, పశ్చిమ గోదావరి జిలా్లో 9 లక్షలు, గుంటూరులో 14 లక్షలు, కృష్ణా జిల్లాలో 9.4 లక్షలు, నెల్లూరులో 7 లక్షలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో 1.52 నికర వసూళ్లు, 2.25 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

    ఇక తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే.. కర్ణాటకలో రొమాంటిక్ సినిమాపై పునీత్ రాజ్‌కుమార్ మరణం ప్రభావం భారీగా పడింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం 3 లక్షల రూపాయలు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 1. 61 కోట్లు నికరంగా, రూ.2.42 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    రొమాంటిక్ లాభాల్లోకి రావాలంటే..

    రొమాంటిక్ లాభాల్లోకి రావాలంటే..


    రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.4.60 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం 5 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే తొలి రోజు తర్వాత ఈ చిత్రం ఇంకా ఈ చిత్రం రూ.3.40 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. తొలి రోజు జోష్ కొనసాగితే మొదటి వారాంతంలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Akash Puri and Ketika Sharma's latest film is Romantic. Directed by Anil Paduri, Written by Puri Jagannadh. This films first day collections are..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X