twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR day 2 collections : రెండో రోజూ సరికొత్త రికార్డులు బద్దలు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

    |

    ప్రస్తుతం మన దేశమంతా RRR మేనియా నడుస్తోంది. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఒక రకంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా వరుస రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. ఇప్పటికే మొదటి రోజు అనేక రికార్డులు బద్దలు కొట్టిన RRR రెండు రోజు కూడా రికార్డులు బద్దలు కొడుతూ స్వైర విహారం చేస్తోంది. రెండో రోజు ఏమేరకు కలెక్షన్లు రాబట్టింది అనేది పరిశీలిద్దాం

    రౌద్రం రణం రుధిరం

    రౌద్రం రణం రుధిరం

    టాలీవుడ్‌లో మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలు పోషించారు.

    కీలక పాత్రల్లో

    కీలక పాత్రల్లో

    RRR అనేది తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించరు. డివివి దానయ్య 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో RRRని నిర్మించారు . అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహా ఒలివియా మోరిస్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.

    223 కోట్లకు పైగా కలెక్షన్లు

    223 కోట్లకు పైగా కలెక్షన్లు

    ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌ సహా అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాక రామ్‌చరణ్‌, తారక్‌ల నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ తొలిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

    తెలుగు రాష్ట్రాల కలెక్షన్ రిపోర్ట్

    తెలుగు రాష్ట్రాల కలెక్షన్ రిపోర్ట్

    RRR సినిమా 2వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ రిపోర్ట్ కనుక మనం పరిశీలిస్తే ఈ మేరకు ఉన్నాయి. నైజాంలో 15.10 కోట్లు, సీడెడ్ లో : 5.50 కోట్లు, ఉత్తరాంధ్ర : 3.98 కోట్లు, ఈస్ట్: 1.58 కోట్లు, వెస్ట్: 95 లక్షలు గుంటూరు: 1.81 కోట్లు, నెల్లూరు : 1.81 కోట్లు కలెక్ట్ చేసి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 31.63 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 47.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

    Recommended Video

    RRR Day1 Worldwide Collections ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ..బాహుబలి 2 బ్రేక్ |FilmibeatTelugu
    ఓవరాల్ గా

    ఓవరాల్ గా

    ఓవరాల్ గా RRR సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ఈ మేరకు ఉంది. నైజాంలో : 38.45 కోట్లు, సీడెడ్ లో : 22.50కోట్లు, ఉత్తరాంధ్ర : 11.40 కోట్లు, ఈస్ట్: 6.97Cr కోట్లు, వెస్ట్: 6.88Cr కోట్లు, గుంటూరు: 9.61 కోట్లు, కృష్ణ: 6.07 కోట్లు, నెల్లూరు: 3.86 కోట్లు, సంపాదించింది. ఇక ఏపీ తెలంగాణ కలిపి 105.74 కోట్లు షేర్, 152.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటలలో : 12.60 కోట్లు, తమిళనాడు: 10 కోట్లు, కేరళ: 3.10 కోట్లు, హిందీ : 21.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.30 కోట్లు, ఓవర్సేస్ లో 46.20 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ గా 202.44 కోట్ల షేర్, 356 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. CR+)

    English summary
    RRR Film records steady collections in all areas on day 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X