twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 24 Days Collections: సండే కలెక్షన్లు డబుల్.. మళ్లీ ఆ మార్క్ చేరుకుని.. మరో 14 కోట్లు వస్తే!

    |

    తన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. గతంలో ఆయన తెరకెక్కించిన 'బాహుబలి' ఇండియన్ బాక్సాఫీస్‌పై ఏ రేంజ్‌లో హవాను చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి భారీ విజయం తర్వాత దర్శకధీరుడు రూపొందించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో దీని రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక, అనుకున్నట్లుగానే దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ 24 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇప్పటి వరకూ దీనికి ఎన్ని కోట్లు లాభం వచ్చింది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి మరి!

    మెగా.. నందమూరి మల్టీస్టారర్‌గా

    మెగా.. నందమూరి మల్టీస్టారర్‌గా

    ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తీసిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటించారు.

    మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

    24వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    24వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    ఏపీ, తెలంగాణలో RRRకు 24వ రోజు కలెక్షన్లు పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.26 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్‌‌ను రాబట్టింది.

    ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!

    24 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    24 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 109.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.21 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.81 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.93 కోట్లు, గుంటూరులో రూ. 17.77 కోట్లు, కృష్ణాలో రూ. 14.31 కోట్లు, నెల్లూరులో రూ. 9.09 కోట్లతో కలిపి రూ. 263.84 కోట్లు షేర్, రూ. 398.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    24 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 263.84 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.75 కోట్లు, తమిళనాడులో రూ. 37.50 కోట్లు, కేరళలో రూ. 10.35 కోట్లు, హిందీలో రూ. 124.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 98 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లోనే రూ. 586.04 కోట్లు షేర్‌, రూ. 1082 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    Pooja Hegde: పూజా హెగ్డే అందాల జాతర.. ఉల్లిపొరలాంటి బట్టల్లో యమ హాట్‌‌గా!Pooja Hegde: పూజా హెగ్డే అందాల జాతర.. ఉల్లిపొరలాంటి బట్టల్లో యమ హాట్‌‌గా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 586.04 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 133.04 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

    డబుల్ కలెక్షన్లు.. మరో 14 కోట్లు వస్తే

    డబుల్ కలెక్షన్లు.. మరో 14 కోట్లు వస్తే

    RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 17 రోజుల పాటు కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ మళ్లీ 24వ రోజు కోటి మార్కును చేరుకుంది. ఇక, ఈ సినిమాకు మరో 14 కోట్లు షేర్ వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్ల మార్కును చేరుకుంటుంది. అలాగే, 18 కోట్లు గ్రాస్ వస్తే 1100 మార్కును చేరుతుంది. 17 కోట్లు షేర్ వస్తే లాభాలు 150 కోట్లు అవుతాయి.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 586.04 Cr Share in 24 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X