Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RRR 39 Days Collections: మళ్లీ భారీ ఎదురుదెబ్బ.. 39 రోజుల్లో తొలిసారి ఇలా.. టోటల్ రిపోర్టు చూస్తే!
పేరుకు తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించడంతో పాటు విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకున్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో పాటు ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడమే.
దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో ఆదరణను దక్కించుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా ఐదు వారాల పాటు ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో 39వ రోజైన సోమవారం ఈ సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. మరి ఇప్పటి వరకూ RRR ఎంత రాబట్టిందో చూద్దామా!

పిరియాడిక్ కథతో విజువల్ వండర్
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా చేశారు.
బుల్లి గౌనులో శ్రీముఖి పరువాల విందు: ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
రిలీజ్‌కు ముందే RRR మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

39వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
RRRకు 39వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 39 రోజైన సోమవారం రెండు రాష్ట్రాల్లో రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.
Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

39 రోజుల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 39 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.78 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.15 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.21 కోట్లు, గుంటూరులో రూ. 18.04 కోట్లు, కృష్ణాలో రూ. 14.57 కోట్లు, నెల్లూరులో రూ. 9.30 కోట్లతో కలిపి రూ. 267.97 కోట్లు షేర్, రూ. 405.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ తెలంగాణలో RRR 39 రోజుల్లో రూ. 267.97 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 44.00 కోట్లు, తమిళనాడులో రూ. 38.33 కోట్లు, కేరళలో రూ. 10.58 కోట్లు, హిందీలో రూ. 132.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 101.73 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 39 రోజుల్లోనే రూ. 604.06 కోట్లు షేర్, రూ. 1123.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 39 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 604.06 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 151.06 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

39 రోజుల్లో తొలిసారి తక్కువగానే
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆరంభం నుంచీ మంచి కలెక్షన్లే వస్తున్నాయి. అయితే, 39వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 14 లక్షలే రాబట్టింది. మొత్తంగా ఆరోజున ఇది అన్ని ఏరియాలను కలుపుకుని కూడా రూ. 37 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఈ ఫుల్ రన్‌లో ఇదే తక్కువ కావడం గమనార్హం.