Don't Miss!
- News
Viral Video: కార్యకర్తపై రాయి విసిరిన మంత్రి.. వీడియో వైరల్..
- Lifestyle
అపార్ట్మెంట్ కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ ఇన్.. నెంబర్ వన్ ర్యాంకు గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట 'కేఎల్ రాహుల్-అతియా శెట్టి' లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
- Finance
Super Stock: అదరగొడుతున్న స్టాక్.. ఒకేసారి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్.. మీ దర్గర ఉందా..?
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
RRR 44 Days Collections: 44వ రోజు కలెక్షన్లు ఎంతంటే? టోటల్ లాభమెంతో తెలిస్తే!
తెలుగు సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్, అన్నింటికీ మించి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు.
దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఇప్పటికీ ఇది కలెక్షన్లను చక్కగా రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 44 రోజుల్లో RRR ఎంత రాబట్టింది? దీనికి లాభాలు ఎంత వచ్చాయి? అనే విషయాలను మీరూ తెలుసుకోండి!

స్టార్ హీరోలను కలిపేసిన జక్కన్న
తెలుగులో స్టార్లుగా వెలుగొందుతోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా చేశారు.
Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
రిలీజ్‌కు ముందు భారీ అంచనాలను ఏర్పరచుకోవడంతో RRR మూవీ హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

44వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీకి ఆరంభం నుంచే మంచి ఆదరణ దక్కుతూ వచ్చింది. అందుకే ఇది వారంలోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. అయితే, క్రమంగా ఈ సినిమా ప్రభావం తగ్గుతూ వస్తోంది. కానీ, వీకెండ్స్‌లో పుంజుకుంటూ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 44వ రోజైన శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి దీనికి రూ. 18 లక్షలు షేర్ వచ్చింది.
బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

44 రోజుల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 44 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.94 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.93 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.21 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.27 కోట్లు, గుంటూరులో రూ. 18.09 కోట్లు, కృష్ణాలో రూ. 14.64 కోట్లు, నెల్లూరులో రూ. 9.34 కోట్లతో కలిపి రూ. 268.94 కోట్లు షేర్, రూ. 407 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ, తెలంగాణలో RRR 44 రోజుల్లో రూ. 268.94 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 44.28 కోట్లు, తమిళనాడులో రూ. 38.49 కోట్లు, కేరళలో రూ. 10.63 కోట్లు, హిందీలో రూ. 133.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 102.12 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 44 రోజుల్లోనే రూ. 606.71 కోట్లు షేర్, రూ. 1129.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 44 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 606.71 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 153.71 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.