Don't Miss!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Travel
వస్త్ర ప్రపంచానికి మన పెడన కలంకారి ఓ అలంకరణ!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
RRR 47 Days Collections: 453 కోట్ల టార్గెట్.. 47 రోజుల్లో భారీగా.. లాభాలే అన్ని కోట్లు
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా పెరిగిపోయింది. ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. 1920 దశకం నాటి కథతో వచ్చిన ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటించారు.
Bigg Boss Non Stop: బిందుపై నటరాజ్ అసభ్య వ్యాఖ్యలు.. అవి చూపించడానికే అలాంటి బట్టలు అంటూ!
దేశమే మెచ్చిన దర్శకుడు రాజమౌళి రూపకల్పనలో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా కావడంతో 'RRR (రౌద్రం రణం రుధిరం)' ప్రకటన సమయం నుంచే అంచనాలను ఏర్పరచుకుంది. ఆ తర్వాత దీని నుంచి వచ్చిన అప్‌డేట్ల కారణంగా హైప్ అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇది తెలుగు సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బిజినెస్ కావడం విశేషం.

బడా హీరోల కలయికలో రూపొందిన RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభం నుంచే మంచి ఆదరణ దక్కుతూ వచ్చింది. అందుకే ఇది వారంలోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. అంతేకాదు, చాలా ఏరియాల్లో ఆల్‌టైం రికార్డును కూడా నమోదు చేసుకుంది. అయితే, క్రమంగా ఈ సినిమా ప్రభావం తగ్గిపోతూనే ఉంది. అప్పుడప్పుడూ వీకెండ్స్‌లో పుంజుకుంటూ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 47వ రోజైన మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దీనికి రూ. 11 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. ఓవరాల్‌గా అన్ని ఏరియాలను కలుపుకుని దీనికి 47వ రోజు రూ. 31 లక్షలు షేర్ వచ్చింది.
మళ్లీ రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: తడిచిన బట్టల్లో శృతి మించి మరీ దారుణంగా!
RRR మూవీకి ఏపీ తెలంగాణలో 47 రోజుల్లో భారీ కలెక్షన్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.74 కోట్లు, సీడెడ్‌లో రూ. 51.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 35.02 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.31 కోట్లు, గుంటూరులో రూ. 18.13 కోట్లు, కృష్ణాలో రూ. 14.67 కోట్లు, నెల్లూరులో రూ. 9.36 కోట్లతో కలుపుకుని రూ. 269.51 కోట్లు షేర్, రూ. 408 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 44.42 కోట్లు, తమిళనాడులో రూ. 38.58 కోట్లు, కేరళలో రూ. 10.65 కోట్లు, హిందీలో రూ. 133.42 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 102.35 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 47 రోజుల్లోనే రూ. 608.17 కోట్లు షేర్, రూ. 1132.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 47 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 608.17 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 155.17 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుని హవాను చూపించింది.