twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR Collections: మొదటి రోజే హాలీవుడ్ మూవీ రికార్డ్ బ్రేక్.. తెలుగు సినిమా దెబ్బకు ఆ దేశంలోనూ!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత కాలం పాటు హవాను చూపించి.. 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియాపై దండయాత్ర ప్రారంభించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్రంతో తన స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు తెలుగు సినిమా స్థాయి ఏంటో కూడా నిరూపించాడు. అంతటి భారీ విజయం తర్వాత జక్కన్న ఇప్పుడు చెక్కిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఆరంభంలోనే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో విడుదలైన రోజే ఇది హాలీవుడ్ మూవీ రికార్డును బ్రేక్ చేసేసింది. ఆ లెక్కలేంటో మీరూ చూడండి!

    Recommended Video

    RRR Day1 Worldwide Collections ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ..బాహుబలి 2 బ్రేక్ |FilmibeatTelugu
    భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

    భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

    దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేసిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో నటించారు.

    బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మబెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్


    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో, 20 దేశాల్లో దీన్ని రిలీజ్ చేశారు.

    బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

    బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 190 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

    జిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకంజిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకం

    కళకళలాడుతూ.. అదిరే టాక్‌తో

    కళకళలాడుతూ.. అదిరే టాక్‌తో


    మెగా నందమూరి హీరోల కలయికలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే, రివ్యూలు కూడా ఈ సినిమాకు మంచిగానే వస్తున్నాయి.

    మారుమ్రోగుతోన్న మూవీ పేరు

    మారుమ్రోగుతోన్న మూవీ పేరు

    అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇక, వాళ్ల నిరీక్షణను నేటితో తెరపడింది. దీంతో అందరూ థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాను చూస్తున్నారు. దీంతో ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతూనే ఉంది.

    RRR Twitter Review: తెలుగోడు మీసం తిప్పే టాక్.. ఇండియన్ చరిత్రలో తొలిసారి.. ఏ హీరో రోల్ బాగుందంటే!RRR Twitter Review: తెలుగోడు మీసం తిప్పే టాక్.. ఇండియన్ చరిత్రలో తొలిసారి.. ఏ హీరో రోల్ బాగుందంటే!

    ఓవర్సీస్‌లో భారీగానే వసూళ్లు

    ఓవర్సీస్‌లో భారీగానే వసూళ్లు


    మిగిలిన ప్రాంతాల కంటే ఓవర్సీస్‌లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ బుకింగ్స్ ముందుగానే ప్రారంభం అయ్యాయి. అక్కడ ప్రీమియర్స్‌ సహా మొదటి రోజు టికెట్లు కూడా ఎప్పుడో బుక్ అయిపోయాయి. దీంతో విడుదలకు ముందే ఇది దాదాపు 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు కూడా నమోదు అయ్యాయి.

    హాలీవుడ్ మూవీని దాటేసింది

    హాలీవుడ్ మూవీని దాటేసింది

    తాజాగా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. శుక్రవారం ఈ సినిమా 3.1 మిలియన్ డాలర్లను రాబట్టింది. తద్వారా హాలీవుడ్ మూవీ 'బ్యాట్‌మన్'(1.4 మిలియన్స్)ను వెనక్కి నెట్టేసింది. సగటున ఆర్ఆర్ఆర్‌కు ఒక్కో షోకు 3100 డాలర్లు వస్తుండగా.. బ్యాట్‌మన్‌కు మాత్రం కేవలం 467 డాలర్లే వసూలు అవుతున్నాయి.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Movie Reach Top Place at US Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X