»   » సీన్ లోకి కొర్రపాటి సాయి...9 కోట్ల డీల్, బాలయ్య పై నమ్మకం అలాంటిది

సీన్ లోకి కొర్రపాటి సాయి...9 కోట్ల డీల్, బాలయ్య పై నమ్మకం అలాంటిది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కొర్రపాటి సాయి ...మరో దిల్ రాజు లాగ మారారు. ఆయన ఓ చిత్రం రైట్స్ తీసుకుంటున్నారంటే మిగతా ఏరియాలు టక్కున మంచి రేటుకు అమ్ముడయ్యే పరిస్దితి ఏర్పడింది. గతంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల ట్రాక్ రికార్డ్ తో సినిమా బిజినెస్ కు ఊపు వచ్చేస్తోంది. తాజాగా ఆయన కన్ను బాలయ్య వందో చిత్రం పై పడిందని సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే... నందమూరి నటసింహం బాలయ్య హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కు వెళ్లకముందు నుంచి ట్రేడ్ వర్గాల్లో ఎంక్వైరీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు అప్పట్నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున మొదలైంది.

తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి 'గౌతమిపుత్ర శాతకర్ణి' సీడెడ్ హక్కులను సుమారు 9 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొర్రపాటి సాయి సీన్ లోకి వచ్చి ఆ రేటు పెట్టడంతో మిగతా ఏరియాల బిజినెస్ సైతం స్పీడుగా అనుకున్న రేటుకే జరుగుతోందని నిర్మాతలు ఖుషీగా ఉన్నారట.

చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sai Korrapati offers fancy price for Gouthamiputra?

వీటికి తోడు తన మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో ఓవర్సీస్ కలెక్షన్స్ లోనూ రికార్డులు సృష్టించేందుకు బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ యూఎస్ లో బాలయ్య కనీసం అర మిలియన్ మార్క్ ను కూడా టచ్ చేయలేదు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని మిలియన్ డాలర్ క్లబ్ లో చేర్చేలా ప్లానింగ్స్ జరుగుతున్నాయి.

దర్శకుడు క్రిష్ కు ఓవర్సీస్ లో మంచి పేరు ఉంది. పైగా గౌతమిపుత్ర శాతకర్ణికి క్రిష్ తండ్రి అతని స్నేహితుడే నిర్మాతలు కావడంతో.. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ కుమ్మేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.

మరో ప్రక్క యుద్ధ సన్నివేశాలు.. ఈ మూవీకి హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. అసలు వీటి విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశ్యంతోనే.. మొదట మొరాకో.. జార్జియా షెడ్యూల్స్ ను ఫినిష్ చేశాడట దర్శకుడు. ఆ దేశాల్లో తెరకెక్కించిన యుద్ధాల సీక్వెన్స్ లపై ప్రస్తుతం 4 గ్రాఫిక్స్ టీమ్ లు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి నాటికల్లా శాతకర్ణి షూటింగ్ పూర్తయిపోతుందని అంటున్నారు.

అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. గ్రాఫిక్ వర్క్స్ ను చూసుకుంటూ.. డిసెంబర్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసిందట శాతకర్ణి యూనిట్. వచ్చే ఏడాది పొంగల్ స్పెషల్ గా రిలీజ్ కానున్న శాతకర్ణి.. బాలయ్య కెరీర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయేందుకు క్రిష్ చాలా ప్రయత్నిస్తున్నాడు.

English summary
The distribution rights for Ceded area for Nandamuri Balakrishna’s 100 the film, ‘Gautamiputra Satakarni’, have been acquired for a fancy prince of around 9 crores by star producer Sai Korrapati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu