»   » టాకేమో పెద్ద ఫ్లాపు...పైసలేమో మస్తు వసూలు

టాకేమో పెద్ద ఫ్లాపు...పైసలేమో మస్తు వసూలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా పెద్ద ఫ్లాఫు అని అందరూ ఏకిపాడేసారు. అయితే ఇప్పుడు కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి అని భాక్సాఫీస్ చూసి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇది తెలుగు సినిమా గురించి కాదండోయ్. హిందీ సినిమా హమ్ షకల్స్ గురించి. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ వీకెండ్ లో నలభై కోట్లు వరకూ సంపాదించిందని చెప్తున్నారు.

సైఫ్ అలీ ఖాన్, రితీష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్, తమన్నా, ఈషా గుప్త, బిపాసా కలిసి నటించిన ఈ చిత్రం బడ్జెట్ 75 కోట్లు అయ్యింది. అయితే తొలివీకెండ్ లోనే 40 కోట్లు మార్క్ ని క్రాస్ చేసింది. అలాగే శాటిలైట్,మ్యూజిక్ రైట్స్ కలిసి 45 కోట్లు వచ్చాయట. ఇంకేముంది ఇప్పటికే దాదాపు రికవరీ అయిపోయినట్లే. ఇంకేమన్నా పైన వస్తే లాభం క్రింద లెక్క.

Sajid Khan's Humshakals to touch Rs.50 crore mark soon


సైఫ్ ఆలీఖాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న వెరైటీ ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రమే 'హమ్ షకల్స్'. ట్రిపుల్ రోల్ క్యారెక్టర్లతో హమ్ షకల్స్ చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కించారు. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో బిపాషా బసు, తమన్నా మరియు ఈషా గుప్తాలు నటించారు. ఇందులో మొత్తం తొమ్మది పాత్రలుంటాయట. ఇందులో చెరో మూడు పాత్రల్లో సైఫ్, రితేష్ రామ్ డాన్ నటించారు. ప్రతి క్యారెక్టర్ దేనికదే వెరైటీగా ఉంటుందట. బాలీవుడ్ లో ఫస్ట్ టైం తొమ్మిది పాత్రలతో సినిమాను తెరకెక్కించామని అంటున్నారు దర్శక, నిర్మాతలు.

English summary
Humshakals has minted over Rs.40 crore in the opening weekend.
 "Humshakals" recorded a super weekend of Rs.40.13 crore. The Fox Star Studios and Vashu Bhagnani's co-production, which couldn't impress the critics, has already sold its satellite and music rights for Rs.45 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu