»   » రూ.400 కోట్లు క్రాస్ చేసింది

రూ.400 కోట్లు క్రాస్ చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది.

చిత్ర విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 12న విడుదలైంది. రాజశ్రీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూ.80 కోట్లబడ్జెట్‌తో నిర్మించింది. అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తొలిరోజే బాక్సాఫీసు వద్ద ఈ హిందీ చిత్రం దాదాపు రూ.40 కోట్ల కలెక్షన్లు సాధించింది.

Salman Khan, Sonam Kapoor’s ‘Prem Ratan Dhan Payo’ earns Rs.400 cr

ఇక సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలీల' పేరుతో విడుదల చేశారు. తెలుగులో సల్మాన్‌ఖాన్‌కు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ విశేషం.

ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదలైంది. తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్‌ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొచ్చారు. అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'ను తెరకెక్కించారు. విడుదలకు ముందే సంగీతం, శాటిలైట్‌ హక్కుల అమ్మకం ద్వారా రూ.57 కోట్లు ఆదాయం వచ్చింది. హిమేష్‌ రేష్మియా స్వరపరిచిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. సంగీతం హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు ఈ చిత్రానిదే రికార్డు.

సల్మాన్‌కు ప్రేమ్‌ పేరుతో అదృష్టం కలిసొచ్చింది. బర్జాత్యాతో చేసిన చిత్రాలతో పాటు కొన్ని ఇతర చిత్రాల్లోనూ సల్మాన్‌ పాత్రకు ప్రేమ్‌ పేరు పెట్టారు. అవి దాదాపు విజయం సాధించాయి. ఇప్పుడు 'ప్రేమ్‌ రతన్‌..'తో సల్మాన్‌ 12వ సారి ప్రేమ్‌గా కనిపించాడు.

English summary
Salman Khan's latest box office outing, Prem Ratan Dhan Payo, has finally crossed the Rs 400-crore mark in India.
Please Wait while comments are loading...