For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yashoda Collections: సగానికి సగం డౌన్.. అయినా అన్ని కోట్ల వసూళ్లు.. లాభాలతో సమంత రికార్డు

  |

  దాదాపు దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత రూత్ ప్రభు. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలనే చేసిన ఈ సుందరి.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రాధాన్యత ఉన్న రోల్స్‌నే చేస్తోంది. మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సమంత 'యశోద' అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటించింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'యశోద' 11 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

  యశోదగా ఎంట్రీ ఇచ్చిన సామ్

  యశోదగా ఎంట్రీ ఇచ్చిన సామ్

  టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'యశోద'. ఈ మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. దీన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేశారు. దీనికి మణిశర్మ సంగీతం అందించారు.

  Bigg Boss Elimination: తొలిరోజే షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని ప్లేయర్.. ప్రమాదంలో ఆ లేడీస్

  థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

  థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

  క్రేజీ కాంబోలో వచ్చిన 'యశోద' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో ఈ మూవీకి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 1.30 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 11.50 కోట్ల బిజినెస్ జరిగింది.

  11వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

  11వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

  సమంత 'యశోద' మూవీకి 11 రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 32 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వసూలైంది.

  ఆరియానా ఎద అందాల ఆరబోత: వామ్మో ఇలా తెగించేసిందేంటబ్బా!

  11 రోజులకు ఎంత వచ్చింది?

  11 రోజులకు ఎంత వచ్చింది?

  11 రోజుల్లో సమంత 'యశోద' మూవీకి వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 84 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 58 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 8.39 కోట్లు షేర్, రూ. 14.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

  ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

  ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

  ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 8.39 కోట్లు వసూలు చేసిన 'యశోద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.25 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.68 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 11 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.52 కోట్లు షేర్‌, రూ. 28.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

  బికినీలో షాకిచ్చిన దీపికా పిల్లి: ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో

  టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

  టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

  సరికొత్త కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'యశోద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.52 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.52 కోట్లు లాభాలు వచ్చాయి.

  మరో కోటి వస్తే సమంత రికార్డు

  మరో కోటి వస్తే సమంత రికార్డు

  సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు అదిరిపోయేలా వచ్చాయి. ఇలా ఇప్పటికే 1.50 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది. ఇక, ఈ చిత్రానికి మరో రూ. 1.10 కోట్లు గ్రాస్ వస్తే.. 30 కోట్ల మైలురాయిని చేరుతుంది. అదే జరిగితే సమంత మరో రికార్డు క్రియేట్ చేస్తుంది.

  English summary
  Samantha Ruth Prabhu Did Yashoda Movie Under Hari and Harish direction. This Movie Collects Rs 13.52 Cr in 11 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X