twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Yashoda 13 Days Collections కలెక్షన్స్ తగ్గినా జోరు తగ్గని సమంత హవా.. 13 రోజుల్లో ఆ రికార్డు!

    |

    టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా నిలదొక్కుకుంటూ ముందుకు సాగుతోంది ఈ బ్యూటి. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంత చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా నార్త్ లో కూడా మోస్ట్ పాపులర్ అయిన విషయం తెలసిందే.

    ఇక ఈ మధ్య ఎక్కువగా లేడి ఒరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది సామ్. ఇటీవల యశోద సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరోగసి నేపథ్యంతో వచ్చిన ఈ మూవీకి 13 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాళ్లోకి వెళితే..

    మ్యూజిక్ తో మణిశర్మ మ్యాజిక్..

    మ్యూజిక్ తో మణిశర్మ మ్యాజిక్..

    తెలుగులో స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ రోల్ లోనటించిన తాజా చిత్రమే 'యశోద'. హరి అండ్ హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరోగసి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేశారు. తన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశారు మెలోడి బ్రహ్మా మణిశర్మ.

    థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్..

    థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్..

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం 'యశోద'పై ప్రారంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో ఈ సినిమాకు రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 1.30 కోట్ల వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 11.50 కోట్ల బిజినెస్ అయింది.

    13వ రోజు కలెక్షన్స్..

    13వ రోజు కలెక్షన్స్..

    సమంత 'యశోద' మూవీకి 13వ రోజు వసూళ్లు అంతకుముందు రోజుతో పోల్చుకుంటే సగం తగ్గాయి. సామ్ యశోద సినిమా 12వ రోజు మాత్రం రూ. 21 లక్షల వసూళ్లు రాబడితే 13వ రోజు మాత్రం నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో రూ. 12 లక్షలు రాబట్టగలిగింది. సినిమాకు మంచి టాక్ లభించిన రోజులు గడిచిన కొద్ది కలెక్షన్స్ తగ్గుతున్నట్లు చెప్పవచ్చు.

    13 రోజుల్లో వచ్చింది ఎంతంటే..

    13 రోజుల్లో వచ్చింది ఎంతంటే..

    సమంత 'యశోద' మూవీకి 13 రోజుల్లో వచ్చిన వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ సినిమాకు నైజాంలో రూ. 4.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 88 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ. 60 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి రూ. 8.72 కోట్లు షేర్, రూ. 15.45 కోట్లు గ్రాస్ వసూలైంది.

    వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే..

    వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే..

    ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 8.72 కోట్లు వసూలు చేసిన 'యశోద' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఒక్క 13వ రోజు 18 లక్షల షేర్, రూ. 45 లక్షల గ్రాస్ పర్వాలేదనిపించింది. ఇక మొత్తం 13 రోజుల్లో కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.30 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 1.26 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.75 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 13 రోజుల్లో సమంత యశోద సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.03 కోట్లు షేర్‌, రూ. 30.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    అన్ని కోట్ల లాభంతో హిట్ గా యశోద..

    అన్ని కోట్ల లాభంతో హిట్ గా యశోద..

    క్రేజీ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'యశోద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.03 కోట్లు వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా.. రూ. 2.03 కోట్ల లాభంతో హిట్ టాక్ తెచ్చుకుంది.

    యశోద రికార్డు..

    యశోద రికార్డు..

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. అలాగే ఇందులో సమంత యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో ఈ సినిమాకు మొదటగా కలెక్షన్లు అదిరిపోయేలా ఉన్నా రోజులు గడిచే కొద్ది తగ్గుతున్నాయి. అయినా కూడా ఈ సినిమా ఇప్పటికి రూ. 30.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

    English summary
    Tollywood Star Heroine Samantha Movie Yashoda 13 Days Total Worldwide Box Office Collection Is Rs. 30.10 Cr
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X