Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్: ఆ 4 సినిమాల టార్గెట్ సెట్టయ్యింది.. ఎవరెవరు ఎంత రాబట్టాలంటే..
టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. బాక్సాఫీస్ దాదాపు 10 నెలలు సైలెంట్ గా ఉంది. దాన్ని దుమ్ము దులపడానికి నలుగురు హీరోలు పవర్ఫుల్ గా సిద్ధమయ్యారు. ముఖ్యంగా దేశం మొత్తంలో విజయ్ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా తెలుగు రాష్టంలో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా తక్కువనే చెప్పాలి. ఇక రామ్, రవితేజ మధ్య అసలైన పోటీ ఉండగా మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

రవితేజ క్రాక్ టార్గెట్
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసి చాలా కాలమవుతోంది. ఆయన అభిమానులు ఒక్క హిట్టు కొడితే చాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి 'క్రాక్' హడావుడి చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది. ఈ సినిమా 13.5కోట్ల బిజినెస్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మినిమమ్ 14కోట్లు రాబడితేనే లాభల్లోకి వచ్చినట్లు. జనవరి 9న క్రాక్ రిలీజ్ అవుతోంది.

రెడ్ ఎంత కలెక్ట్ చేయాలంటే..
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెడ్ సినిమాపై కూడా అంచనాలు భారిగానే ఉన్నాయి. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశాడు. అయితే సినిమాకు సంబంధించిన బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. 15.5కోట్లు. మినిమమ్ 20కోట్లు ఈజీగా రాబట్టవచ్చని టాక్ వస్తోంది. అయితే పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి హిట్ టాక్ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెడ్ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది.

మాస్టర్ ఈజీ టార్గెట్..
ఇక విజయ్ మాస్టర్ 9కోట్లు రాబట్టాలి. విజయ్ కు గత కొంతకాలంగా తెలుగులో మార్కెట్ అయితే బాగానే పెరుగుతోంది. ఇక ఈ సారి మాస్టర్ తో టార్గెట్ ను ఈజీగా అందుకోవచ్చని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. మాస్టర్ సినిమా జనవరి 13 థియేటర్స్ లోకి రానుంది.

బెల్లంకొండ హీరో అదృష్టం ఎలా ఉందో..
బెల్లంకొండ శ్రీనివాస్ చాలా రోజుల తరువాత అల్లుడు అదుర్స్ అనే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే మినిమమ్ 11.5కోట్లు రావాల్సి ఉంది. బెల్లంకొండ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు అందించలేకపోయాయి. మరి ఈ పండగ సీజన్ లో జనవరి 15న అందరికంటే కాస్త చివరగా రానున్న బెల్లంకొండ బాబు ఎలాంటి వసూళ్లను అందుకుంటాడో చూడాలి.