»   » బాక్సాఫీసు టాక్: సంక్రాంతి సినిమాల పరిస్థితి ఎలా ఉంది?

బాక్సాఫీసు టాక్: సంక్రాంతి సినిమాల పరిస్థితి ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యాయి. తొలుత ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' విడుదల కాగా, మర్నాడు బాలయ్య నటించిన ‘డిక్టేటర్', శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా విడుదలయ్యాయి. సంక్రాంతి రోజు నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం విడుదలైంది.

అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదలయ్యే సరికి పరిస్థితి ఎలా ఉంటుందో? అంటూ తొలుత అందరూ కాస్త ఆందోళన చెందారు. అయితే విడుదలైన ఈ నాలుగు సినిమాలకు బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలు, బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు. పండగ సీజన్, హాలీడేస్ కావడంతో విడుదలైన అన్నిచోట్ల ఈ చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.


Sankranthi tollywood boxoffice report

అయితే చివరగా.... బాక్సాఫీసు రేసులో విజేత ఎవరు? ఎవరి సినిమా ఎక్కువ వసూలు చేస్తుంది? ఎవరి సినిమా నిర్మాతలకు ఎక్కువ లాభాలు తెస్తుంది అనేది తెలియాలంటే ఓ వారం ఆగాల్సిందే. బాలయ్య, నాగార్జున, ఎన్టీఆర్ సినిమాలతో పాటు శర్వానంద్ వీరిలో ఎవరు సంక్రాంతి నెం.1 హీరో అనిపించుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇప్పటి వరకైతే... ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' సినిమా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని అంటున్నారు. ఈ వీకెండ్ గడిచిన తర్వాత సినిమా ఫలితాలపై ఓ అంచనాకు రావడానికి వీలుంటని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఫిల్మీబీట్ మీకు అందిస్తూనే ఉంటుంది.

English summary
Sankranthi tollywood boxoffice report on Nannaku Prematho, Dectator, Soggade Chinni Nayana, Express Raja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu