»   » సర్దార్ రికార్డ్: నిజమే బాహుబలిని మించిపోతోంది!

సర్దార్ రికార్డ్: నిజమే బాహుబలిని మించిపోతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం విదేశాల్లో రిలీజ్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొత్తం 40 దేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి కూడా ఈ రేంజిలో ఒకేసారి ఇన్ని దేశాల్లో విడుదలకాలేదు.

ఆఫ్రికాలో 9 దేశాల్లో, మిడిల్ ఈస్ట్ ఏరియాలో 9 దేశాల్లో, ఏసియాలో 6 దేశాల్లో, యూరఫ్ లో 14 దేశాలతో పాటు యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజియాలాండ్ ఇలా మొత్తం 42 దేశఆల్లో సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ చేసేందకు ప్లాన్ చేసారు. ఏప్రిల్ 8వ తేదీన తెలుగు, హిందీలో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

Sardaar Gabbar Singh to release in over 42 countries

బాలీవుడ్లో దాదాపు ఎనిమిది వందల పైచిలుకు థియేటర్లలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యారు. సర్దార్ సినిమా ద్వారా తన సినిమా పరిధిని విస్తరించాలని నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోంది.

బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షించేందుకు డిఫరెంటుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. మరి బాలీవుడ్ చిత్ర సీమలో పవన్ జోరు ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

English summary
Power Star Pawan Kalyan’s upcoming action entertainer, Sardaar Gabbar Singh is going to release in over 42 countries across the world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu