»   » 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో డేట్, వెన్యూ ఖరారు

'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో డేట్, వెన్యూ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రం ఆడియో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక్క ప్రోమో తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో ని మార్చి 18 న విడుదల చేయటానికి నిర్ణయించారని సమాచారం.

అలాగే ఆ ఆడియోని హైదరాబాద్ లోని గచ్చి బౌళి స్టేడియం గ్రౌండ్స్ లో గ్రాండ్ చేస్తే బావుంటుందని యోచిస్తున్నారు. అయితే అక్కడ ఫర్మిషన్ విషయమై ఏదన్నా సమస్య వస్తే నిజాం కాలేజి గ్రౌండ్స్ కు మార్చే అవకాసం ఉంది. ఆడియో వెన్యూపై రకరకాల ఆప్షన్స్ తర్జనబర్జనలు జరుగుతున్నాయి. వెన్యూ ఫైనలైజ్ చేసి అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.


Sardaar Gabbar Singh’s audio Venue fixed

పవన్ కళ్యాణ్ కేవలం నటుడుగానే కాకుండా కధ, స్క్రీన్ నుంచీ అన్నీ దగ్గరుండి చూసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశల్లో ఉన్న ఈ సినిమా ఆడియో గురించి గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు షికార్లు చేసాయి. అయితే వాటన్నిటిని ఈ చిత్ర నిర్మాత అయిన శరత్ మరార్ తోసిపుచ్చాడు.


"టీం అందరూ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడానికి కృషి చేస్తున్నారు. వచ్చే వారాంతమే సర్దార్ ఆడియో ఉంటుంది. సరైన డేట్ కోసం చూస్తున్నాము" అని తెలిపారు. దీంతో సర్దార్ కు ఆడియో ఉండదనే వార్తలకు చెక్ చెప్పినట్లు అయ్యింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Pawan Kalyan and Kajal Agarwal starrer 'Sardaar Gabbar Singh's audio launch event will be held on 18th March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu