»   » పవన్ సినిమా కు ఆ ముద్ర తప్పదు

పవన్ సినిమా కు ఆ ముద్ర తప్పదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెల్లి మెల్లిగా తెలుగు సినిమా కార్పోరేట్ సంస్ధలు...అదీ బాలీవుడ్ లో పేరొందిన సంస్దల చేతిలోకి వెళ్లితోందా అనే అనుమానం ఇప్పుడు అందరికి కలుగుతోంది. ఇండిడ్యువల్ ప్రొడ్యూసర్స్ తగ్గిపోయి..కార్పోరేట్ ఫండ్స్ తో నడిచే సినిమాలు రావటమే దీనికి కారణం. టాలీవుడ్ లో ప్రతీ పెద్ద సినిమా వెనక ఈరోస్ కానీ, రిలియన్స్ కానీ ఉంటోంది. వారి ముద్ర లేనిదే సినిమా బయిటకు రావటం లేదు.

మొన్న సంక్రాంతికి విడుదలైన డిక్టేటర్ కి ఈరోస్ ముద్ర ఉంటే, నాన్నకు ప్రేమతో చిత్రానికి రిలియన్స్ అని పడింది. ఇప్పుడు మరిన్ని చిత్రాలకు ఈరోస్ ఇంటర్ నేషనల్ ముద్ర తప్పడంలేదు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరోక సినిమా చేరినట్టు సమాచారం. అదే పవన్ కళ్యాణ హీరోగా రూపోందుతున్న సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాను సుమారు 70 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమాపై కూడా ఈరోస్ ముద్ర తో రిలీజ్ అవుతుందన్నమాట.

Sardar Gabbar Singh theatrical rights by Eros

ఇక చిత్రం విషయానికి వస్తే...సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హడావిడిగా పవన్ కళ్యణ్ సింగపూర్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సింగపూర్ నుండి ఆయన తిరిగి వచ్చేసారు. త్వరలో షూటింగ్ పాల్గోనున్నారని, ఈ సినిమా కంటిన్యూగా 29 రోజుల షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు రాయ్ లక్ష్మి, సంజనా స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు ఈ చిత్రానికి డైరక్టర్ బాబి. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా, పవన్ కళ్యాన్ సోంత బ్యానర్ లో శరత్ మారార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ను మే 6న, ఆడియోని మార్చ్ 12న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు.

English summary
Eros International bagged ‘Sardar Gabbar Singh’ theatrical rights for a whopping sum of Rs 70crs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu