Just In
- 9 min ago
కార్తీకేయ 2 కోసం బాలీవుడ్ నటుడు.. అదిరిపోయే అప్డేట్
- 26 min ago
అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్
- 38 min ago
షాదీ ముబారక్ కలెక్షన్లు.. సాగర్ ఆర్కే నాయుడుపై తరగని ప్రేక్షకుల ఆదరణ!
- 1 hr ago
స్టార్ క్రికెటర్‌తో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి.. ఎప్పుడు.. ఎక్కడంటే?
Don't Miss!
- News
కుర్రో కుర్రో..చంద్రబాబు పలుకు: చూపుడు వేలితో చేయరాని నేరం: కోయదొర వేషంలో టీడీపీ నేత
- Sports
అదే ఇంగ్లండ్ కొంపముంచింది.. దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి: సునీల్ గవాస్కర్
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు బాక్సాఫీస్ దాడి.. 10 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ హవా ఇంకా కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ కావడంతో తొలివారం గ్రాండ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో వారంలోనూ అదే జోష్ కనబరుస్తోంది. అలవోకగా 100 కోట్ల మార్క్ దాటేసి సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. మరి ఈ 10 రోజుల్లో ఎంత రాబట్టిందో ఓ లుక్కేద్దామా..

మహేష్ బాబు బాక్సాఫీస్ దాడి.. ఫ్యాన్స్ సంబరాలు
మహర్షి జోష్ కంటిన్యూ చేస్తూ సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నారు మహేష్ బాబు. సంక్రాంతి బరిలో నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చి మొదటి రోజే బాక్సాఫీస్ దాడి షురూ చేసిన మహేష్.. నేటికీ ఆ దాడిని ఆపడం లేదు. దీంతో ఈ పది రోజుల కలెక్షన్స్ చూసి సంబర పడుతున్నారు ఆయన ఫ్యాన్స్.

10 రోజుల్లో ఏపీ, తెలంగాణలో మొత్తం షేర్
గత 10 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు సాధించిన మొత్తం నైజాంలో రూ.33 కోట్లు సీడెడ్‌లో రూ.14.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.17.07 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.10.06 కోట్లు పశ్చిమ గోదావరిలో రూ.6.57 కోట్లు, గుంటూరులో రూ.9.03 కోట్లు కృష్ణా జిల్లాలో రూ.7.97 కోట్లు నెల్లూరులో రూ.3.62 కోట్లుగా రిపోర్ట్ బయటకొచ్చింది.

దేశవిదేశాల్లో కలెక్షన్స్
ఇక దేశవిదేశాల్లో కలెక్షన్స్ రిపోర్ట్స్ చూస్తే.. రెస్ట్ ఆఫ్ ఇండియా 10.25 కోట్లు, నార్త్ అమెరికా 8.8 కోట్లు, గల్ఫ్ 1.25 కోట్లు, ఆస్ట్రేలియా అండ్ న్యూజీలాండ్ 0.9 కోట్లు, సింగపూర్ 0.4 కోట్లు, యూకె 0.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 0.5 కోట్లు వసూలయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సరిలేరు నీకెవ్వరు హంగామా కనిపిస్తోంది. ఈ 10 రోజుల్లో మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 124.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టి కంటిన్యూ కంటిన్యూ అంటోంది సరిలేరు నీకెవ్వరు మూవీ.

సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ బిజినెస్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాంలో రూ.25 కోట్లు, సీడెడ్‌లో రూ.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 7 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు, గుంటూరులో రూ.7 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు, నెల్లూరులో రూ.3 కోట్లు, కర్ణాటకలో రూ.8 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లుగా ఉంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో మహేష్ జోడీగా రష్మిక మందన్న నటించింది. దిల్ రాజు, అనిల్ సుంకరలతో మహేష్ బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. విజయశాంతి ప్రకాష్ రాజ్, సంగీత, హరితేజా, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.