Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రికార్డులు తిరగరాస్తున్న మహేష్.. సంక్రాంతి బరిలో 'సరిలేరు నీకెవ్వరు'.. 5 డేస్ డీటైల్ రిపోర్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు మాంచి జోరుమీదున్నారు. తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' తో రికార్డులను తిరగరాస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను ప్రేక్షకుల ముందుంచి వేట మొదలెట్టారు. పండగ జోష్ చూపిస్తూ సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అయ్యారు. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేస్తోంది. వివరాల్లోకి పోతే..

న్యూ ఇయర్.. బ్లాక్‌బస్టర్ కా బాప్
ఈ సంక్రాంతికి ''బ్లాక్‌బస్టర్ కా బాప్'' అనిపించుకుంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ.అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో 2020 ప్రారంభంలోనే టాలీవుడ్‌కి కిక్ స్టార్ట్ ఇచ్చారు మహేష్ బాబు. సూపర్ స్టార్ అందుకున్న ఈ విజయాన్ని చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సరికొత్త నాన్ బాహుబలి రికార్డ్స్
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా చాలా ఏరియాల్లో సరికొత్త నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేసిందని తెలుస్తోంది. ఈస్ట్ గోదావరి, నైజాం, నెల్లూరు ప్రాంతాల్లో సత్తా చాటిన ఈ చిత్రం గుంటూరు, వైజాగ్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కి చేరువైంది. వెస్ట్ గోదావరిలో అయితే మహేష్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ.

రెండు తెలుగు రాష్ట్రాలు.. ప్రీ రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు సినిమాకు నైజాంలో 26 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఉత్తరాంధ్ర 10 కోట్లు, ఈస్ట్ గోదావరి 7.5 కోట్లు, వెస్ట్ గోదావరి 6 కోట్లు, గుంటూరు 7.3 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 3.1 కోట్లు.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 77.9 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విడుదల తర్వాత కలెక్షన్స్.. ఇప్పటికి
విడుదల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా హవా కనిపించింది. ఇప్పటికే పలు ఏరియాల్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ షేర్ 68.22 కోట్లు నమోదు చేసిందని తాజా రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది.

ఏయే ఏరియాలో ఎంతెంత? పరిస్థితి ఎలా ఉంది..
నైజాంలో 22.5 కోట్లు (నాన్ బాహుబలి రికార్డ్), ఉత్తరాంధ్రలో10.05 కోట్లు (బ్రేక్ ఈవెన్), సీడెడ్‌లో 9.75 కోట్లు, గుంటూరునే 7.19 కోట్లు(బ్రేక్ ఈవెన్), ఈస్ట్ గోదావరినే 6.22 కోట్లు (బ్రేక్ ఈవెన్, నాన్ బాహుబలి రికార్డ్), కృష్ణానే 5.55 కోట్లు,వెస్ట్ గోదావరి 4.54 కోట్లు (ఆల్ టైమ్ రికార్డ్), నెల్లూరునే 2.42కోట్లు (నాన్ బాహుబలి రికార్డ్).

తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు.. డీటైల్ రిపోర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదో రోజు 9.66 కోట్లు రాబట్టింది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. నైజాంలో 3.45 కోట్లు, సీడెడ్ 1.55 కోట్లు, ఉత్తరాంధ్ర 1.67 కోట్లు, ఈస్ట్ గోదావరి 0.87 కోట్లు, వెస్ట్ గోదావరి 0.53 కోట్లు, గుంటూరు 0.55 కోట్లు, కృష్ణా 0.68 కోట్లు, నెల్లూరు 0.36 కోట్లు వసూలయ్యాయి.

బిగ్గెస్ట్ హిట్ దిశగా.. మహేశ్ కెరీర్‌లోనే
మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించే దిశగా సరిలేరు నీకెవ్వరు పరుగులు తీస్తోంది. దిల్‌రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది.