For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata: విడుదలకు ముందే మహేశ్ రికార్డు.. కెరీర్‌లోనే రెండో హయ్యస్ట్ మూవీ ఇదే!

  |

  బాల నటుడిగా తెరంగేట్రం చేసి.. చిన్న వయసులోనే తన సత్తాను నిరూపించుకుని.. ఆ తర్వాత హీరోగా మారి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. యాక్టింగ్‌కు యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్, స్టైల్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు.

  ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ 'సర్కారు వారి పాట' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇది విడుదల కాకముందే అతడు అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  సర్కారు వారి పాటతో మహేశ్

  సర్కారు వారి పాటతో మహేశ్

  హిట్లు మీద హిట్లు కొడుతూ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

  దీప్తి సునైనా అందాల ఆరబోత: అలాంటి బట్టల్లో గతంలో చూడనంత హాట్‌గా!

  సందేశాత్మక కథతో తెరకెక్కి

  సందేశాత్మక కథతో తెరకెక్కి

  'సర్కారు వారి పాట' మూవీని బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తీస్తున్నారట. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతే.. అప్పుడు హీరో.. తన తండ్రి కోసం విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అని అంటున్నారు. ఇందులో మహేశ్ బాబు పాత్ర హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.

  రిలీజ్‌కు రెడీ.. ఫ్యాన్స్ రచ్చ

  రిలీజ్‌కు రెడీ.. ఫ్యాన్స్ రచ్చ

  సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' మూవీ విడుదలపై చాలా రోజుల పాటు సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మే 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫీవర్ మొదలైంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు.

  స్పోర్ట్స్ బ్రాతో శృతి హాసన్ సెల్ఫీ: టాప్ వ్యూ నుంచి ఎద అందాల జాతార

  అన్ని హక్కులు హట్ కేక్‌లే

  అన్ని హక్కులు హట్ కేక్‌లే

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయని అంటున్నారు.

   ఏపీ, తెలంగాణలో బిజినెస్

  ఏపీ, తెలంగాణలో బిజినెస్

  'సర్కారు వారి పాట'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 36 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7 కోట్లు, గుంటూరులో రూ. 9 కోట్లు, కృష్ణాలో రూ. 7.50 కోట్లు, నెల్లూరులో రూ. 4 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

  Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

  టోటల్ బిజినెస్ ఎంతంటే

  టోటల్ బిజినెస్ ఎంతంటే

  తెలుగులోనే భారీ స్థాయిలో విడుదల కాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమా రెస్టాఫ్ ఇండియా హక్కులకు రూ. 11.50 కోట్లకు, ఓవర్సీస్ హక్కులకు రూ. 11 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా ఉంది.

  టాప్ 10లోకి.. మహేశ్‌కు 2

  టాప్ 10లోకి.. మహేశ్‌కు 2

  'సర్కారు వారి పాట'కు రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ వ్యాపారం జరుపుకున్న చిత్రాల్లో ఇది పదో స్థానానికి చేరింది. అంతేకాదు, 'స్పైడర్' (124.30 కోట్లు) తర్వాత ఎక్కువ బిజినెస్ చేసుకున్న మహేశ్ మూవీగా నిలిచింది. ఇక, ఈ లిస్టులో RRR రూ. 451 కోట్లతో మొదటి స్థానంలో, బాహుబలి 2 రూ. 352 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Lets Know This Movie Pre Release Business Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X