»   » ఇక కేరళలలో కుమ్ముడే కుమ్ముడు..డేట్ ఇచ్చారు

ఇక కేరళలలో కుమ్ముడే కుమ్ముడు..డేట్ ఇచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లు అర్జున్ కు మళయాళంలోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అక్కడ కూడా సరైన సమయం చూసి ఆయన సినిమాలు రిలీజ్ చేసి విజయం సాధిస్తూంటారు.

తాజాగా అల్లు అర్జున్‌ హీరోగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్ గా తెలుగులో ఇటీవల విడుదలైన చిత్రం'సరైనోడు'.ఈ చిత్రం మలయాళంలో మే 13న విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించారు.


ఈ చిత్రాన్ని మలయాళంలో రీమేక్‌ చేసి మే 13న కేరళలో విడుదల చేస్తున్నట్లు అల్లు అర్జున్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తెలుపుతూ పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు.దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ ''బన్నీ, ఆది, కేథరిన్‌, రకుల్‌, శ్రీకాంత్‌... ఇవన్నీ కథలోంచి పుట్టిన పాత్రలు. వారివారి పాత్రలకు అంతా న్యాయం చేశారు. బన్నీని మరో లెవెల్‌లో చూపించే సినిమా ఇది. కృషి, కసి కలిస్తే బన్నీ. నా హల్లో ఉన్న కథానాయకుడి పాత్రకి నూటికి నూరుశాతం న్యాయం చేకూర్చాడు. బన్నీ అభిమానులకు ఈ సినిమా ఓ పండగ. '' అన్నారు.


''న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి. అన్యాయానికి అసలు పాదాలే ఉండకూడదు అని నమ్మే ఓ వ్యక్తి కథ ఇది. అతని పోరాటం ఎవరిమీదో తెలియాలంటే 'సరైనోడు' చూడండి'' అంటున్నారు బోయపాటి శ్రీను.


Sarrainodu’s Malayalam release date confirmed

నిర్మాత అరవింద్‌ మాట్లాడుతూ ''ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన స్టైలిష్‌ చిత్రాల్లో 'సరైనోడు' మేటిగా నిలుస్తుంది. బోయపాటికి ఓ శైలి ఉంది. ఏ సినిమా అయినా తనదైన ముద్ర కనిపిస్తుంది. బన్నీ స్టైల్‌ని వదలకుండా, తన శైలిలోనే 'సరైనోడు' తెరకెక్కించిన విధానం ఆకట్టుకొంటోంది''అన్నారు.


విలన్ గా చేసిన ఆది మాట్లాడుతూ ''కథానాయకుడిగా నటిస్తూ, విలన్ గా ఎందుకు ఒప్పుకొన్నావని చాలామంది నన్ను అడుగుతున్నారు. వాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెప్పింది. బన్నీ, బోయపాటి శ్రీను, అల్లు అరవింద్‌ అంకుల్‌... ఈ ముగ్గురూ కష్టపడేతత్వం ఉన్నవాళ్లే. వాళ్లకు సాంకేతిక బృందం నుంచి మంచి సహకారం అందింది. బన్నీకి ఇక్కడే కాదు కేరళలోనూ అభిమానులున్నారు. ఈ సినిమాతో తమిళంలోనూ అభిమానుల్ని సంపాదించుకుంటాడు''అన్నారు.

English summary
Sarrainodu Malayalam version is all set to hit the screens on the 13th of this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu