»   » 'సరైనోడు' డివైడ్ టాక్, అందుకే నారా రోహిత్ కు స్పీడు అయ్యాడు

'సరైనోడు' డివైడ్ టాక్, అందుకే నారా రోహిత్ కు స్పీడు అయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నారా రోహిత్‌, ఇషా తల్వార్‌ జంటగా నటించిన చిత్రం 'రాజా చెయ్యివేస్తే'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేయటానికి ధియేటర్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే సరైనోడు చిత్రం యావరేజ్ టాక్ రావటంతో ఈ శుక్రవారం(ఏప్రియల్ 29) విడుదల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో తారకరత్న విలన్ గా కనిపించనున్నారు. ప్రదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూర్చారు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ, 'దర్శకుడు ప్రదీప్‌ తనకేం కావాలో అది చేయించుకున్నారు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ అందించారు. సాయి కార్తీక్‌తో చాలా సినిమాలు చేశాను. తను మంచి సంగీతమందిస్తారు. ఈ సినిమా బాగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు' అని చెప్పారు.

నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ, ''ఈగ', 'అందాల రాక్షసి', 'లెజెండ్‌', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్య' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో ప్రదీప్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.

Seeing Sarrainodu Output Raja Cheyyi Veste Film Gears Up

ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌, సాయి కార్తీక్‌ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం.

'తుంటరి', 'సావిత్రి' వంటి వరుస చిత్రాల తర్వాత నారా రోహిత్‌ నుంచి వస్తున్న మరో మంచి చిత్రమిది. విలన్‌గా నందమూరి తారకరత్న అద్భుతమైన నటనను కనబరిచారు. అతని విలనిజం ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది'
అని అన్నారు.

'సాయి కార్తీక్‌ పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా నిర్మించిన వారాహి చలన చిత్ర సంస్థకీ నాకు మంచి అనుబంధముంది. నాతో 'లెజెండ్‌' చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంలోని పాత్రలను బాగా తీర్చిదిద్దారు. సినిమా మంచి విజయం సాధించాలి' అని బాలకృష్ణ తెలిపారు.

English summary
Nara Rohit and Nandamuri Taraka Ratna's film Raja Cheyyi Veste makers have announced that the film is going to hit screens this Friday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu