»   »  ఈ రోజు 7 తెలుగు చిత్రాలు రిలీజ్ (ఫొటో ఫీచర్)

ఈ రోజు 7 తెలుగు చిత్రాలు రిలీజ్ (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పెద్ద సినిమాల హడావుడి లేనప్పుడు ఒకేసారి రెండు మూడు చిన్న చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయాత్తం అవుతుంటాయి. ఈవారం కూడా అలా రెండూ, మూడే వస్తే పెద్ద విశేషమేమీ ఉండేదికాదు గానీ... ఈసారి మాత్రం ఏకంగా ఏడు చిత్రాలొస్తున్నాయి. అంటే.. దాదాపు ప్రతి థియేటర్‌లోనూ ఏదో ఓ కొత్త సినిమా కనిపిస్తుందన్నమాట.

స్టార్ హీరో నటించిన చిత్రం ఏకంగా 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలాంటప్పుడు చిన్న చిత్రాలకు చోటే ఉండదు. ఒక్కొక్క చిన్న సినిమా కనీసం వంద థియేటర్లలో విడుదలైనా.. కనీసం పది సినిమాలు విడుదల చేసుకోవచ్చు. అందుకే.. పెద్ద సినిమాలేం లేనప్పుడు చిన్నవి ఇలా గుంపుగా వస్తుంటాయి. ప్రతివారం నాలుగైదు సినిమాలు విడుదలైతేనే పరిశ్రమ కళకళలాడుతుంది. కార్మికులు బతుకుతారు. పరిశ్రమకు ఇది శుభపరిణామం

తెలుగు సినిమాలతో పాటు, కొన్ని అనువాద చిత్రాలూ బరిలోకి దిగబోతున్నాయి. ఈ స్థాయిలో చిన్న సినిమాలు దండయాత్ర చేయడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. 'లెజెండ్‌', 'మనం', 'రౌడీ', 'అనామిక', 'రేసుగుర్రం' రావడానికి ఇంకొంచెం సమయం ఉంది. అందుకే 'మంచి తరుణము మించిన దొరకద'ని ఎనిమిది చిత్రాలు వరుస కట్టేశాయి. ఈ హంగామా వచ్చేవారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి.

చిన్న సినిమా విడుదలకు సమస్య ఒక్కటే.. థియేటర్లు దొరక్కపోవడం. స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చిన్న సినిమాలన్నీ వణికి పోవాల్సిందే. పెద్దవన్నీ వెళ్లిపోయాక ఇలా చిన్న సినిమాలు క్యూ కట్టడం రివాజుగా మారుతోంది. మార్చి 21న మరో అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

చిన్న సినిమాలే కదా, అని తీసి పడేయవలసిన అవసరం లేదు. గతంలో చిన్న సినిమాలే.. బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆ సత్తా.. ఈ సినిమాల్లోనూ ఉండే ఉండొచ్చు. డబ్బింగ్‌ సినిమాలు తెలుగునాట రికార్డు వసూళ్లు సాధించిన సందర్భాలు చూశాం.


స్లైడ్ షోలో ..ఈ వారం వస్తున్న చిత్రాలు...

కమలతో నా ప్రయాణం

కమలతో నా ప్రయాణం

'1940 ఒక గ్రామం'తో విమర్శకులను మెప్పించాడు నరసింహనంది. ఈసారి కమలతో నా ప్రయాణం అంటూ మరోకథ చెప్పబోతున్నాడు. తిలక్‌ రాసిన ఊరిచివర ఇల్లు కథ స్ఫూర్తితో రాసుకొన్న కథ ఇది. కమల అనే వేశ్యకీ, సూర్యం అనే అభ్యుదయ భావాలున్న వ్యక్తికీ మధ్య జరిగిన సంఘర్షణే ఈ చిత్రం. గత వారం విడుదల కావాల్సిన యుద్ధం.. కాస్త ఆలస్యంగా ఈ శుక్రవారం వస్తోంది. తరుణ్‌కి ఓ విజయం అత్యవసరం అనుకొంటున్న దశలో.. యుద్ధం ఎలాంటి ఫలితం ఇస్తుంది. చార్లి, హైదరాబాద్‌ డ్రీమ్స్‌ వినోదాత్మకంగా నడిచే చిత్రాలు. నవతరం దర్శకులు తమ ప్రతిభను ఈ చిత్రాలతో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు.

ఛార్లీ

ఛార్లీ

సాయంత్రం 4 నుంచి రాత్రి 12 మధ్య నడిచే కథతో ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్వించేలా తెరకెక్కిన సినిమా ఇది. కామెడీ జోనర్‌లో ఇదో ప్రయోగాత్మక చిత్రం. నా నటనకు ప్రశంసలొస్తాయన్న నమ్మకం ఉంది అంటున్నారు నటుడు సింహా. ఈ యువనటుడు తెరంగేట్రం చేస్తున్న సినిమా చార్లి . శివనాగరెడ్డి దర్శకుడు. రేర్డన్‌ పిక్చర్స్‌ పతాకంపై సతీష్‌రెడ్డి నిర్మించారు. ముగ్గురు స్నేహితుల మధ్య ఒక రాత్రి జరిగే కథ ఇది. చక్కని కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. పిల్లలు పెద్దలు అంతా కలిసి చూసే క్లీన్‌ యు సినిమా. నా పాత్ర ఆద్యంతం నవ్వుల్ని పంచుతుంది. అయితే ఈ సినిమాలో చార్లీ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అది తెరపైనే రివీల్‌ చేస్తాం అన్నారు.

‘హైదరాబాద్‌ డ్రీమ్స్‌'

‘హైదరాబాద్‌ డ్రీమ్స్‌'

శ్రీగిరి, శ్రీతేజ, ప్రియాంక శర్మ, కావ్యశ్రీ నటీనటులుగా ఎన్‌.అమరేందర్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘హైదరాబాద్‌ డ్రీమ్స్‌'. ఫోర్త్‌వాల్‌ థియేటర్‌ ప్రొడక్షన్స్‌ అండ్‌ బూర్గుల ఫిలింస్‌ పతాకంపై బి.దేవేందర్‌రెడ్డి, రఘురామ్‌శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యం.రత్నం సంగీతం అందించారు.

"ధీరుడు''

విశాల్ హీరోగా భయ్యా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు భూపతి పాండ్యన్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ధీరుడు. దీనిని తనదైన శైలిలో హీరో విశాల్ అందరినీ ఆకట్టుకునే రీతిలో విశాల్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతగా రూపొందించారు. విశాల్ కి దర్శకుడు భూపతి పాండ్యన్ మరో హిట్ చిత్రంగా తెరకెక్కించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య విశాల్ సరసన కథానాయికగా పరిచయం కాబోతుంది. ఇంత వరకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ దీనికి మ్యూజిక్ అందించారు.

'వేట'

'వేట'

మంచివాళ్లకు మంచివాళ్లు.. చెడ్డవాళ్లకు చెడ్డవాళ్లు.. ఇదీ వారిద్దరి మనస్తత్వం. తన వాడు అనుకుంటే ప్రాణం పెట్టే ఆ ఇద్దరు యువకులు ఉన్నట్లుండి పగ, ప్రతీకారం అంటూ చెలరేగిపోయారు. వారి వెనుక కథేంటనేది తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు అశోక్‌ అల్లె. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట'. శ్రీకాంత్‌, తరుణ్‌, జాస్మిన్‌, మధురిమ ప్రధాన పాత్రధారులు. సి.వి.రావు, పి.శ్వేతలానా, సి.వరుణ్‌ కుమార్‌ నిర్మాతలు. సి.కల్యాణ్‌ సమర్పకులు.

రాజా రాణి

రాజా రాణి

2013లో తమిళనాట రిలీజైన సినిమాల్లోనే ఈ సినిమా ఓ రికార్డ్. దాదాపు 50కోట్ల వసూళ్లు సాధించింది ఈ చిత్రం. అందమైన ప్రేమకథా చిత్రమిది. నిజజీవిత కథలా ఉంటుంది. ప్రేమలో విఫలమయ్యాక కూడా ప్రేమ, జీవితం ఉంటాయి అని చెప్పే కథ ఇది

హ్యాంగ్‌ అప్

హ్యాంగ్‌ అప్

ఆ ఇంట్లో ఏం జరిగింది?: అన్నట్టు వీటిలో ఓ థ్రిల్లర్‌ కూడా ఉంది. అదే హ్యాంగ్‌ అప్‌. రాత్రి ఆరుగంటలకు మొదలై.. ఉదయం ఆరింటికి ముగిసే కథ ఇది. హాలీవుడ్‌ హీరో సిల్వెస్టన్‌ స్టాలోన్‌ ఇంట్లో తెరకెక్కించారు. హైదర్‌బిల్‌ గ్రామీ, తీర్థాంకర్‌ దాస్‌ దర్శకులు. ''ఒక ఇంటితో ముడిపడిన థ్రిల్లర్‌ తరహా కథలు చాలా వచ్చాయి. మా హ్యాంగ్‌ అప్‌ కొత్తగా ఉంటుంది. భయాన్ని కొత్త రూపంలో చూపిస్తున్నాం. ఇందులో స్టాలోన్‌ ఇల్లు కూడా ఓ పాత్రే. సాంకేతికంగా ఉన్నత విలువలతో తెరకెక్కించిన చిత్రమిది. కేవలం సౌండ్‌ ఎఫెక్ట్స్‌ కోసమే భారీ ఎత్తున ఖర్చుపెట్టాం'' అని చిత్ర దర్శకుల్లో ఒకరైన దాస్‌ చెప్పారు.

English summary
Small budgeted films are in a rush once again. We have seen this hurry in releasing in the months of March and Aprial when the movements were going great guns in the state of AP.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu