»   » షారుఖ్ సినిమా ట్యూబ్‌లైట్ కంటే దారుణమట.. పేలవంగా కలెక్షన్లు..

షారుఖ్ సినిమా ట్యూబ్‌లైట్ కంటే దారుణమట.. పేలవంగా కలెక్షన్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ల సినిమాలు వస్తున్నాయంటే ఆ చిత్రం ఎలా ఉన్నా ఒపెనింగ్ కలెక్షన్లు దిమ్మ తిరిగేలా ఉండేవి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్, ఇటీవల విడుదలైన షారుక్ చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ చిత్రాలకు సంబంధించిన కలెక్షన్లు దారుణంగా ఉండటం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

ప్రేక్షకుల అంచనాలకు దూరంగా..

ప్రేక్షకుల అంచనాలకు దూరంగా..

బాద్షా షారుక్‌ఖాన్, బ్యూటీ అనుష్క శర్మ నటించిన జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్లు ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. కానీ సినిమా చూసిన తర్వాత ఆ మేరకు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. దాంతో తొలివారాంతంలో కలెక్షన్లు చాలా దారుణంగా పడిపోయాయి. షారుక్ చిత్రం రూ.50 కోట్ల మార్కును కూడా చేరుకోకపోవడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

Shah Rukh Khan, Aamir Khan's First Selfie May Surprise you - Filmibeat Telugu
ట్యూబ్‌లైట్ కంటే దారుణం..

ట్యూబ్‌లైట్ కంటే దారుణం..

జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రం ఇటీవల రిలీజైన సల్మాన్ ఖాన్ చిత్రం ట్యూబ్‌లైట్ కంటే దారుణంగా ఉండటం గమనార్హం. తొలివారాంతానికి ట్యూబ్‌లైట్ చిత్రం రూ.64.77 కోట్లు సాధించగా, షారుక్ ఖాన్ చిత్రం రూ.45.75 కోట్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో షారుక్ చిత్రం ఇంత దారుణమైన కలెక్షన్లు సాధించడం ఇదే తొలిసారి.

ఏకపక్షంగా రివ్యూలు..

ఏకపక్షంగా రివ్యూలు..

ట్యూబ్‌లైట్ సినిమా బాగాలేదంటూ ఏకపక్షంగా రివ్యూలు వచ్చాయి. అయినా వారాంతానికి రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే షారుక్ సినిమాకు మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. లవర్ బాయ్‌గా కనిపించిన షారుక్‌.. ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ట్యూబ్ లైట్, జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రాలు నాసిరకంగా రూపొందించారంటూ విమర్శకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో సల్మాన్, షారుక్ అర్థవంతమైన సినిమా కథలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.

ట్యూబ్‌లైట్ కలెక్షన్లు ..

ట్యూబ్‌లైట్ కలెక్షన్లు ..

ట్యూబ్‌లైట్ చిత్రం తొలివారాంతంలో శుక్రవారం రూ.21.15 కోట్లు, శనివారం రూ.21.17, ఆదివారం రూ.22.45 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 64.77 కోట్లు సాధించింది. ఇటీవల కాలంలో సల్మాన్ చిత్రాలకు వచ్చినది కలెక్షన్లను పోల్చుకొంటే ఇవే తక్కువ. సల్మాన్ తన క్యారెక్టర్ గురించి పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమే సినిమా పరాజయానికి కారణమని విమర్శకులు పేర్కొన్నారు.

 షారుక్ సినిమా వసూళ్లు

షారుక్ సినిమా వసూళ్లు

అలాగే జబ్ హ్యారీ మెట్ సెజల్ శుక్రవారం రూ.15.25 కోట్లు, శనివారం రూ. 15 కోట్లు, ఆదివారం రూ.15.50 కోట్లు, మొత్తం రూ. 45.75 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ వివరాలను ఆయన ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో కథ, కథనం పేలవంగా ఉండటమే కాకుండా సినిమా మొత్తం షారుక్, సల్మాన్ ఖాన్‌లే కనిపించడం ప్రేక్షకులను బోర్ కొట్టించదనే విమర్శలు తలెత్తుతున్నాయి.

English summary
Shah Rukh Khan‘s Jab Harry Met Sejal released on Friday. This movie collections go anywhere near Tubelight. Salman Khan‘s film earned Rs 64.77 crore in the first weekend, SRK’s love story could amass only Rs 45. 75 crore. That’s not how a Shah Rukh Khan film should run at the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu