twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    DJ Tillu 1St Week Collections: 9.50 కోట్ల టార్గెట్.. వారంలోనే ఊహించని విధంగా.. మొత్తం లాభం ఎంతంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ ఏడాది సరైన ఆరంభం దక్కలేదనే చెప్పాలి. కరోనా ప్రభావంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోవడంతో ఈ సారి జనవరిలో కొన్ని చిన్న చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' మినహా మరే సినిమా విజయాన్ని అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీజర్, ట్రైలర్, పాటలతో భారీ అంచనాలను ఏర్పరచుకుని ఈ సినిమా ఇటీవలే విడుదలైన చిత్రం 'డీజే టిల్లు'.

    బజ్‌కు అనుగుణంగానే ఆడియెన్స్ నుంచి దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    తెగ సందడి చేస్తోన్న ‘డీజే టిల్లు'

    తెగ సందడి చేస్తోన్న ‘డీజే టిల్లు'

    సిద్దు జొన్నలగడ్డ - నేహా శెట్టి కాంబినేషన్‌లో విమల్ కృష్ణ రూపొందించిన చిత్రమే 'డీజే టిల్లు'. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ దీన్ని నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి ఇందులో కీలక పాత్రలు చేశారు.

    హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

    భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

    భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

    చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో సినిమాలు చేసినా సిద్దుకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'డీజే టిల్లు' మూవీ హక్కులకు విపరీతంగా పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కూడా దక్కుతోంది.

    7వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

    7వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'డీజే టిల్లు'కు 7వ రోజూ మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 72 లక్షలు షేర్, రూ. 1.22 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీబాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

    7 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    7 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    మొదటి వారం పూర్తయ్యే సరికి 'డీజే టిల్లు' భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో కలిపి రూ. 10.77 కోట్లు షేర్, రూ. 18.87 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

    'డీజే టిల్లు' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.79 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 13.36 కోట్లు షేర్‌తో పాటు రూ. 23.70 కోట్లు గ్రాస్ సొంతం అయింది.

    బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ వారం రోజుల్లో రూ. 13.36 కోట్లు రాబట్టింది. దీంతో ఇది హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.86 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

    English summary
    Tollywood Young Hero Siddu Jonnalagadda Did DJ Tillu Under Vimal Krishna Direction. This Movie Collect 13.36 Cr in 7 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X