twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    DJ Tillu 4 Days Collections: అన్ని కోట్ల టార్గెట్ అప్పుడే ఫినీష్.. తెలుగులో రెండో మూవీగా రికార్డు

    |

    కరోనా ప్రభావంతో కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ విజయాలు అందుకున్న చిత్రాలు పెద్దగా కనిపించడం లేదు. అయినప్పటికీ చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి జనవరిలో ఎక్కువ సినిమాలు రాలేదు. దీంతో అందరి దృష్టి ఫిబ్రవరిలో వచ్చే సినిమాల మీదే పడింది. అందులోనూ చిన్న సినిమాగా వచ్చినా.. భారీ స్థాయిలో హైలైట్ అయిన చిత్రం మాత్రం ఒకటుంది. అదే 'డీజే టిల్లు'. సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. ఇలా భారీ స్థాయిలో గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా ఓ లుక్కేయండి!

    Recommended Video

    DJ Tillu Success Tour|Movie Team Visits Vijayawada Theatre| Siddu, Neha Shetty | Filmibeat Telugu
     ‘డీజే టిల్లు'గా సిద్ధు రచ్చ రచ్చ

    ‘డీజే టిల్లు'గా సిద్ధు రచ్చ రచ్చ

    సిద్దు జొన్నలగడ్డ - నేహా శెట్టి కాంబోలో విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే ‘డీజే టిల్లు'. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల దీనికి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రాశీ ఖన్నా: బాడీ పార్టులు చూపిస్తూ దారుణంగా!అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రాశీ ఖన్నా: బాడీ పార్టులు చూపిస్తూ దారుణంగా!

    బిజినెస్ భారీగా.. గ్రాండ్‌గా రిలీజ్

    బిజినెస్ భారీగా.. గ్రాండ్‌గా రిలీజ్

    సిద్దు జొన్నలగడ్డకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘డీజే టిల్లు' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి దీనికి అదిరిపోయే స్పందన కూడా సొంతం అయింది.

    4వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

    4వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

    4వ రోజూ ‘డీజే టిల్లు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 55 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 1.09 కోట్లు షేర్, రూ. 1.70 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రియుడి బండారం బయటపెట్టిన శృతి హాసన్: ఎప్పుడూ అదే కావాలంటూ పరువు తీసేసింది!ప్రియుడి బండారం బయటపెట్టిన శృతి హాసన్: ఎప్పుడూ అదే కావాలంటూ పరువు తీసేసింది!

    రోజులకూ కలిపి వచ్చిందెంత?

    రోజులకూ కలిపి వచ్చిందెంత?

    నాలుగు రోజులకు కలిపి ‘డీజే టిల్లు' మూవీకి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, గుంటూరులో రూ. 43 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో కలిపి రూ. 8.29 కోట్లు షేర్, రూ. 14.70 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

     వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ‘డీజే టిల్లు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.60 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 10.54 కోట్లు షేర్‌తో పాటు రూ. 18.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    సిద్ధు - నేహా జంటగా నటించిన ‘డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 4 రోజుల్లో రూ. 10.54 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.04 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

     టాలీవుడ్‌లో రెండో మూవీగా రికార్డ్

    టాలీవుడ్‌లో రెండో మూవీగా రికార్డ్

    ఎన్నో అంచనాలతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘డీజే టిల్లు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది నాలుగు రోజుల్లోనే రూ. 9.50 కోట్లు టార్గెట్‌ను పూర్తి చేసుకుని హిట్‌గా నిలిచింది. దీంతో 2022లో ‘బంగార్రాజు' తర్వాత హిట్ అయిన రెండో సినిమాగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీనిపై యూనిట్ ఖుషీగా ఉంది.

    English summary
    Tollywood Young Hero Siddu Jonnalagadda Did DJ Tillu Under Vimal Krishna Direction. This Movie Collect 10.54 Cr in 4 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X