For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్సీ రేటుకు కపేలా మూవీ రీమేక్ రైట్స్.. తెలుగు నిర్మాత చేతికి సెన్సేషనల్ హిట్

  |

  విభిన్నమైన కథాంశాలకు, విలక్షణమైన చిత్రాలకు పెట్టింది పేరు మలయాళం చిత్ర పరిశ్రమ. ఇటీవల కాలంలో పలు మలయాళ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొంటున్నాయి. ప్రేమమ్, లూసిఫర్, అయప్పనుమ్ కోషియం లాంటి చిత్రాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమను విశేషంగా ఆకర్షిస్తున్న చిత్రం కపేలా. చిన్న చిత్రంగా రిలీజై భారీ రెస్పాన్స్‌ను అందుకొంటున్న ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు దర్శక, నిర్మాతలను విశేషంగా ఆకర్షించింది. దాంతో ఈ చిత్ర హక్కులను భారీ రేటుకు చేజిక్కించుకొన్నట్టు సమాచారం. ఇంతకు కపేలా చిత్రంలో ఉన్న విశేషాలు ఏమిటంటే..

  సున్నితమైన, భావోద్వేగంగా

  సున్నితమైన, భావోద్వేగంగా

  మలయాళంలో కపేలా చిత్రం గ్రామీణ నేపథ్యంతో సున్నితమైన, భావోద్వేగమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. ప్రేమ పేరుతో మోసగించబడే యువతకు కనువిప్పు కలిగించేలా ఈ చిత్రం రూపొందింది. అన్నా బెన్, శ్రీనాథ్ భసీ, రోషన్ మ్యాథ్యూ లాంటి యువ నటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మహ్మద్ ముస్తాఫా తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమై మంచి విజయాన్ని, ప్రశంసలను అందుకొన్నారు. ఈ చిత్రం గురించి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ లాంటి సోషల్ మీడియాలో ప్రస్తావించడం ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

  కపేలా కథేంటి అంటే

  కపేలా కథేంటి అంటే

  గ్రామీణ ప్రాంత యువతి జెస్సీ (అన్నా బెన్) విష్ణు అనే ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడుతుంది? ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉండటంతో విష్ణుతో కలిసి జెస్సీ ఊరి నుంచి లేచిపోతుంది. అలా పట్నం చేరిన జెస్సీకి విష్ణు నిజ స్వరూపం తెలుస్తుంది? ఆ క్రమంలో విష్ణు నుంచి తప్పించుకోవాలని చూసే క్రమంలో ఆమెను విష్ణు (రోహన్ మ్యాథ్యూ) కాపాడుతాడు. విష్ణు ఎవరు? జెస్సీని ఎందుకు కాపాడారు అనే ప్రశ్నలకు సమాధానమే కపేలా సినిమా కథ.

  సితారా ఎంటర్‌టైన్‌మెంట్ చేతికి

  సితారా ఎంటర్‌టైన్‌మెంట్ చేతికి

  అత్యంత భావోద్వేగమైన, ఫీల్‌గుడ్‌తో తెరకెక్కిన కపేలా చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ చేజిక్కించుకొన్నది. భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. ఇటీవల ఈ సంస్థ తెలుగులో అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే.

  యువ హీరో, హీరోయిన్ల కోసం వేట

  యువ హీరో, హీరోయిన్ల కోసం వేట

  ఇదిలా ఉండగా, కపేలా తెలుగు రీమేక్‌లో హీరో, హీరోయిన్లు, దర్శకుడి ఎంపికపై సితార ఎంటర్‌టైన్‌మెంట్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఏ యువ హీరో, హీరోయిన్లను ఎంపిక చేయాలి అనే దిశగా యూనిట్ వేట మొదలుపెట్టిందని, ఈ సినిమాకు యువ దర్శకుడికి బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. లాక్‌డౌన్ పరిస్థితులు అదుపులోకి రాగానే సినిమాను మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

  Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
  డిసెంబర్‌లో సెట్స్‌పైకి

  డిసెంబర్‌లో సెట్స్‌పైకి

  టాలీవుడ్‌లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే.. ఈ ఏడాది చివరల్లో కపేలా మూవీ రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని, అలాగే తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి ఫీల్‌గుడ్ సినిమాలో పాత్రలు ఎవరిని వరిస్తాయనే విషయంపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాను తెరకెక్కించే అదృష్టం ఏ దర్శకుడికి లభిస్తుందనే విషయం కూడా చర్చనీయాంశమైంది.

  English summary
  Popular film production house Sithara Entertainments grabs Kappela movie Telugu remake rights which create senasational talk in Malayalam. Anna Ben, Sreenath Bhasi, Roshan Mathew are lead in the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X