»   » ఈ దసరాకు 6 రిలీజ్ లు,అవేంటి, వాటి టాకేంటి ? బడ్జెట్ ఎంత?

ఈ దసరాకు 6 రిలీజ్ లు,అవేంటి, వాటి టాకేంటి ? బడ్జెట్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎప్పటిలాగే ఈ విజయదశమి తెలుగు సినీ ప్రేక్షకులకు కనుల విందు చేయడానికి సిద్ధమయ్యింది. ఈ సారి దసరా రోజున ఆరు చిత్రాలు వెండితెరపై సందడి చేయబోతున్నాయి. ఆరు ..ఆరు రకాల విభిన్నమైన సబ్జెక్టులతో ఈ సినిమాలు రూపొంది

మన ముందుకు వస్తున్నాయి. ఆ చిత్రాలు ఏమిటో,వాటి విశేషాలు ఏమిటో క్రింద చూద్దాం.

పండగ రోజున విడుదల అవుతున్న ఈ చిత్రాలు తప్పకుండా ఈ సారి ప్రేక్షక దేవుళ్లకు మృష్టాన్న భోజనం పెట్టనున్నాయి అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు . దసరా పండుగ సందర్భంగా వచ్చే సెలవులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే

దర్శక, నిర్మాతలు ఇలా రిలీజ్ లు ప్లాన్ చేసారు.

చెవుల్లో పువ్వులు పెట్టుకున్నవాళ్లకు చెప్పండి...అవన్నీ అంటున్నారు

చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆరు సినిమాలూ ఇప్పటికే తమ ట్రైలర్స్ తో ప్రేక్షకులను థియోటర్స్ వరకూ లాక్కెళ్లటానికి స్కెచ్ గీసుకుని కూర్చున్నాయి.

చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ వేసవి తరవాత సంక్రాంతి, దసరా సీజన్లు కీలకం. వరుసగా వచ్చే సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి వరుసగా సినిమాల్ని దించేస్తుంటారు నిర్మాతలు. ఈ పండక్కి ఏకంగా 5 సినిమా లొస్తున్నాయి. శుక్రవారం

ఒక్కరోజే నాలుగు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి పండగకి వస్తున్న సినిమాలేంటి? వాటి విశేషాలేంటి? అనేది చూద్దాం.

చైతూ మూడు గెటప్ లలో

చైతూ మూడు గెటప్ లలో

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌'కి ఇది రీమేక్‌. నాగచైతన్య, శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోనా కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. చైతూ మూడు రకాల

గెటప్పుల్లో కనిపించనున్నాడు. వయసుని బట్టి మారే భావాలు, ప్రేమ, ఆకర్షణ మధ్య తారతమ్యాలు.. వీటి కలయికలో సాగే చిత్రం ‘ప్రేమమ్‌'.

నాగ్ వాయిస్ ఓవర్, వెంకీ గెస్ట్

నాగ్ వాయిస్ ఓవర్, వెంకీ గెస్ట్

వెంకటేష్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వాయిస్‌ ఓవర్‌ రూపంలో నాగార్జున మాటలు కూడా వినిపించనున్నాయి. ‘‘విజువల్‌గా ఈ సినిమాని వేరే స్థాయిలో తెరకెక్కించాం. మాతృక చూసిన వాళ్లకు సైతం మా ‘ప్రేమమ్‌' కొత్తగా

కనిపిస్తుంది'' అని చిత్ర యూనిట్ తెలిపింది.

హిట్ ఇచ్చిన డైరక్టర్ కావటం

హిట్ ఇచ్చిన డైరక్టర్ కావటం

సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా విడుదల కానుంది. యూఎస్‌లో ప్రేమమ్ సినిమా సుమారు 110కి పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుండడం విశేషంగా చెప్పుకోవాలి. నాగ చైతన్యకు యూఎస్‌లో ఇదే అతిపెద్ద రిలీజ్‌. ‘కార్తికేయ'తో

పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‍లు హీరోయిన్లుగా నటించారు. సంగీతం: గోపీ సుందర్‌, రాజేష్‌ మురుగేశన్‌, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ,

దర్శకత్వం: చందూ మొండేటి, బడ్జెట్‌: రూ.20 కోట్లు, విడుదల: శుక్రవారం

చీకటి గదుల్లోకి వెళ్తే..

చీకటి గదుల్లోకి వెళ్తే..

క్యారక్టర్ ఆర్టిస్టు గా చిరపరిచితుడైన ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రమిది. ప్రియమణి, సత్య, పృథ్వీ కీలక పాత్రల్లో నటించారు. శ్రీరామనవమి నేపథ్యంలో సాగే కథ ‘మన వూరి రామాయణం'. మనుషుల్లో ఉండే నిజాయతీ, చీకటి గదుల్లోకి

వెళ్లేసరికి ఎలా మారిపోతుందో థ్రిల్లింగ్‌గా తెరకెక్కించామంటున్నారు ప్రకాష్‌ రాజ్‌.

నవ్వుతూ, ఉలిక్కిపడుతూ..

నవ్వుతూ, ఉలిక్కిపడుతూ..

ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. టైటిల్‌ గీతానికి మంచి ఆదరణ దక్కింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నారు. ‘‘సినిమా చూస్తూ నవ్వుకొంటూ,

మధ్యలో ఉలిక్కిపడుతూ.. ‘అరె' అంటూ ఆశ్చర్యపోయేలా ఉంటుందీ చిత్రం'' అంటున్నారు ప్రకాష్‌రాజ్‌.

చిన్న బడ్జెట్టే కానీ..

చిన్న బడ్జెట్టే కానీ..

దర్శకుడిగా ప్రకాష్ రాజ్ కెరీర్‌కు ఈ చిత్రం కీలకం కానుంది. చాలా కాలం తరవాత ప్రియమణి నటించిన తెలుగు చిత్రమిది. కాబట్టి ఆమెకూ ‘... రామాయణం' కీలకమే. సంగీతం: ఇళయరాజా, నిర్మాత, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్‌, బడ్జెట్‌: రూ.5 కోట్లు,

విడుదల: శుక్రవారం

హీరోయిన్ జీవితం

హీరోయిన్ జీవితం

తమన్నా నటించిన మొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించారు. ప్రభుదేవా, సోనూసూద్‌ కీలక పాత్రధారులు. ఓ హీరోయిన్ జీవితం నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదంతో పాటు, హారర్‌ అంశాలూ

మేళవించినట్టు అర్థమవుతోంది.

ప్రభుదేవాతో పాటు స్టెప్ లు

ప్రభుదేవాతో పాటు స్టెప్ లు

ప్రభుదేవాతో పాటు సమానంగా తమన్నా వేసిన స్టెప్పులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో తన స్టెప్పులతో అదరగొట్టింది తమన్నా. సోనూసూద్‌ తొలిసారి ఓ రొమాంటిక్‌ పాత్రలో కనిపించనున్నాడు.

వామ్మో అంత బడ్జెట్ మరి..

వామ్మో అంత బడ్జెట్ మరి..

‘‘ప్రేక్షకులకు కావల్సిన అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నాయి. తమన్నా కెరీర్‌కి ఇదో కీలకమైన మలుపు కానుంది'' అంటోంది చిత్రబృందం. సంగీతం: సాజిద్‌ - వాజిద్‌, నిర్మాతలు: ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్‌, దర్శకత్వం: విజయ్‌, బడ్జెట్‌:

రూ.70 కోట్లు, విడుదల: శుక్రవారం

విజియేంద్రప్రసాద్ అందించిన కథ

విజియేంద్రప్రసాద్ అందించిన కథ

మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ నటించిన చిత్రమిది.దీప్తి సాటి హీరోయిన్. ‘బాహుబలి', ‘భజరంగీ భాయ్‌జాన్‌' రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథని అందించారు.

తమన్నా డాన్స్ స్పెషల్

తమన్నా డాన్స్ స్పెషల్

ఓ కుర్రాడు తన లక్ష్యం కోసం, ప్రేమ కోసం ఏం చేశాడనే అంశం నేపథ్యంలో సాగే కథ ఇది. యాక్షన్‌ దృశ్యాలకు పెద్ద పీట వేశారు. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసింది. ఆ పాట కోసం తమన్నా భారీ పారితోషికం అందుకొందట. ఓ హీరో ఇంట్రడక్షన్

సినిమాని ఈ స్థాయి బడ్జెట్‌లో తెరకెక్కించడం దక్షిణాదిలోనే ఇది తొలిసారి.

రమ్యకృష్ణ అదరకొడతాడట

రమ్యకృష్ణ అదరకొడతాడట

జగపతిబాబు, రమ్యకృష్ణ పోషించిన పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చిత్రయూనిట్ తెలిపింది. సంగీతం: తమన్‌, నిర్మాత: అనితా కుమార స్వామి, దర్శకత్వం: మహదేవ్‌, బడ్జెట్‌: రూ.70 కోట్లు, విడుదల: గురువారం

ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం

సునీల్‌ సినిమా అంటే కామెడీ గ్యారెంటీ. కాస్త యాక్షన్‌కి, తనదైన శైలిలో డాన్సులు మేళవించి కమర్షియల్‌ హంగులు తీసుకొస్తూ సక్సెస్ కొట్టాలనే వస్తున్నాడు. ‘ఈడు గోల్డ్‌ ఎహె'లోనూ ఆ అంశాలన్నీ కలగలిసినట్టు అర్ధమవుతోంది. సుష్మారాజ్‌, రిచా పనయ్‌

హీరోయిన్స్ గా నటించారు. అలాగే సునీల్ డ్యూయిర్ రోల్ లో కనిపించాడంటున్నారు.

డైరక్టర్ కు, హీరోకు ఇద్దరికి అవసరమే

డైరక్టర్ కు, హీరోకు ఇద్దరికి అవసరమే

‘దూసుకెళ్తా' తరవాత వీరూ పోట్ల నుంచి వస్తున్న చిత్రమిది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సునీల్‌కు.ఈ విజయదశమి ఎలాంటి బహుమతి ఇస్తుందో చూడాలి. ‘‘వినోదంతో పాటు ఓ బలమైన కథా ఉందీ చిత్రంలో. ఈ దసరాకి సరైన సినిమా ఇదే''

అని నమ్మకంగా చెబుతోంది చిత్ర యూనిట్. , సంగీతం: సాగర్‌ ఎం.శర్మ, నిర్మాత: అనిల్‌ సుంకర, దర్శకత్వం: వీరూ పోట్ల, బడ్జెట్‌: రూ.12 కోట్లు, విడుదల: శుక్రవారం.

హైపర్ అంటూ ముందే రామ్

హైపర్ అంటూ ముందే రామ్

ఈ దసరా సెలబ్రేషన్స్ లోకి హీరో రామ్ ముందే వచ్చేసారు. సంతోష్ శ్రీ నివాస్ దర్శకత్వంలో హైపర్ అంటూ వచ్చాడు. అయితే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవటంతో దసరా పండుగ పెద్దగా ఉపయోగపడే అవకాసం ఉండకపోవచ్చు అంటున్నారు.

English summary
It’s going to be raining films this Dasara. As many as six films have confirmed their release dates. Though Dasara falls on October 11, holidays begin earlier.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu