»   » వావ్..: 'నాన్నకు ప్రేమతో' కలెక్షన్స్ ని సైతం నాగ్

వావ్..: 'నాన్నకు ప్రేమతో' కలెక్షన్స్ ని సైతం నాగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. సంక్రాంతి కానుకగా విడుదలై ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి పండుగ వెళ్లిపోయినా కలెక్షన్స్ లో తన మ్యాజిక్ ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా యంగ్ హీరోల చిత్రాలను బీట్ చేస్తూ ఈ చిత్రం కలెక్షన్స్ సాగటం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆంద్రాలో తూర్పు గోదావరి వంటి జిల్లాల్లో ...ఎన్టీఆర్ సంక్రాంతి చిత్రం నాన్నకు ప్రేమతోను బీట్ చేయటం విశేషం.

ఇప్పటి వరకు సీడెడ్ లో నాలుగు కోట్ల రూపాయలు, నైజాంలో అయితే 7 కోట్ల రూపాయలు వసులు చేసిందని, ఇంక ఈస్ట్ గోదావరిలో అయితే నాన్నకు ప్రేమతో కన్నా ముందే వుందని సమాచారం. ఈ సందర్బంగా నాగార్జన తన ట్విట్టర్ ఖాత ద్వారా సోగ్గాడే చిన్ని నాయినా రాకింగ్ ఆల్ ఓవర్ ఏగైన్ దిస్ వీకెండ్ అంటా ట్వీట్ చేసారు. దానిని ఇక్కడ మీరు చూడండి.ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.


నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.


English summary
Nagarjuna's Soggade Chinni Nayana has now collected Rs 4 Cr in Ceded area. In Nizam it has crossed Rs 7 Cr. In some districts like East Godavari in Andhra, the movie is on the way to gross more than Nannaku Prematho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu