»   » ‘సోగ్గాడే చిన్ని నాయానా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

‘సోగ్గాడే చిన్ని నాయానా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీసు రారాజు నాగార్జునే అని తేలి పోయింది. ఈసారి పండక్కి నాలుగు సినిమాలు విడుదలైన నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయానా' సినిమానే మిగిలిన నాలుగు సినిమాల కంటే మంచి ఫలితాలు సాగిస్తోంది. రివ్యూల పరంగా, మౌత్ టాక్ పరంగా ఈ సినిమాకే ఎక్కువ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రం తొలి వారాంతం ఏపీ, తెలంగాణల్లో రూ. 10.43 కోట్లు వసూలు చేసింది. సోమవారం కూడా కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. మంగళవారం కూడా టికెట్లు ముందస్తుగానే బుక్ అయ్యాయి.

యూఎస్ బాక్సాఫీసు వద్ద కూడా ‘సోగ్గాడే చిన్ని నాయనా' మంచి ఫలితాలు రాబడుతోంది. ప్రీమియర్ షోకు $ 50,523, విడుదలై రోజైన శుక్రవారం $ 108,005, శనివారం $ 198,364, ఆదివారం $ 178,291 వసూలు చేసింది. తొలి వారాంతం యూఎస్ఏలో $ 535,183 [రూ 3.62 కోట్లు] వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. ఈ జోరు ఇలానే కొనసాగితే సినిమా త్వరలోనే 1 మిలియన్ మార్కను అందుకుంటుందని అంటున్నారు. అదే నిజమైతే యూఎస్ఏలో నాగార్జున తొలి 1 మిలియన్ మార్క్ సినిమా అవుతుంది.


సోగ్గాడే చిన్ని నాయానా....ఓవర్సీస్ తో కలిసి మొత్తం 450 స్క్రీన్లలో విడుదలైంది. ఎక్కువ స్క్రీన్లు నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ చిత్రాలే ఆక్రమించాయి. అయితే చాలా చోట్ల ఆ సినిమాలకు కలెక్షన్లు తగ్గడంతో వాటిని ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో రీప్లేస్ చేస్తున్నారు.


ఈ చిత్రాన్ని కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాత కూడా నాగార్జునే. చాలా ఏరియాల్లో ఆయనే సొంతగా రిలీజ్ చేసుకున్నారు. విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ చిత్రం ప్రాఫిట్ జోన్లోకి వెలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు సంబంధించిన ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు స్లైడ్ షోలో...

English summary
Nagarjuna's Soggade Chinni Nayana emerged as the Pongal winner this season with great box office performance, good reviews and tremendous word of mouth. The film has garnered around 10.43 Cr in Andhra Pradesh and Telangana alone, during its first weekend, while it is equally strong on its first Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu