twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విచిత్ర పరిస్ధితిలో 'శ్రీరామ రాజ్యం'(ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    బాపు, బాలకృష్ణల కాంబినేషన్ లో వచ్చిన శ్రీరామ రాజ్యం చిత్రం భాక్సాఫీస్ వద్ద విచిత్ర పరిస్దితిని ఎదుర్కొంటోంది.టాక్ ఫుల్..కలెక్షన్స్ నిల్ అన్నట్లుగా మారింది. సినిమా విడుదల అవ్వగానే సమీక్షకులు వద్దనుంచే కాక అన్ని వర్గాల జనం నుంచి కూడూ ఇంతటి అధ్బుతమైన సినిమా విడుదల కాలేదని ఇనానమస్ గా అన్నారు. అయితే అంతటి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ మాత్రం అస్సలు కనపడటం లేదని ట్రేడ్ టాక్. అలాగని ఈ చిత్రానికి పోటీ చిత్రాలు కూడా ఏమీ మార్కెట్ లో లేవు. దూకుడు హవా తగ్గిన నేపధ్యంలో అంతగా చెప్పుకోదగ్గ సినిమా సైతం జనాలకి అందుబాటులో లేదు. ఓహ్ మై ప్రెండ్ కూడా అన్ని చోట్లా డ్రాప్ అయ్యిపోయింది. దాంతో శ్రీరామ రాజ్యంకు కలెక్షన్స్ లేకపోవటానకి కారణం ప్రమోషన్ సమస్యా లేక మరేదైనానా అనేది అంతటా చర్చగా మారిన విషయం.

    ఓపినింగ్ రెగ్యులర్ బాలకృష్ణ సినిమాకు ఉన్నంతలేకపోయినా ఓకే అనుకున్నారు. పౌరాణికం కాబట్టి మెల్లిగా పికప్ అవుతుందని భావించారు. ఇంతకుముందు అన్నమయ్య వంటి చిత్రాలు రిలీజైన వెంటనే లేకపోయినా తర్వాత జనాలకి పట్టి బాగా వర్కవుట్ అయ్యాయి. ఆ మాదిరిగానే ఈ సినిమాకి జరుగుతుందని భావించారు. అయితే ఆ వాతావరణం ఇక్కడ కనిపించటం లేదు. అన్నమయ్య,శ్రీరామ దాసు వంటి చిత్రాలకు ప్లస్ గా మారిన సంగీతం శ్రీరామ రాజ్యంలో జనాలకు పట్టలేదు. ఆ పాటలే జనాలని ధియోటర్స్ కి లాక్కొచ్చాయి. ఇక ఈ వారం కేవలం నారా రోహిత్ సోలో మాత్రమే విడుదల అవుతోంది. ఈ సినిమా కూడా నిజానికి శ్రీరామ రాజ్యంకి పోటీ కాదు. వచ్చే వారం నుంచి అయితే వరసగా పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వాటినుంచి పోటీ గట్టిగానే ఉంటుంది. మరి ఈ వారంలో అయినా కలెక్షన్స్ పుంజుకుని శ్రీరామ రాజ్యం నిలబడుతుందని ఆశిద్దాం.

    English summary
    Sri Rama Rajyam is still struggling to get good collections. This week there is only Solo to compete with it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X